Andhra Pradesh: ‘బేబి’ సినిమాను మించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఆ ఇద్దరూ నిలదీయడంతో..
పెద్ద హిట్టు కొట్టింది. కారణం అందులోని ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒకరిని ప్రేమిస్తూ.. మరొకరితోనూ చనువుగా ఉంటుంది. ఇదే విషయంపై ఇద్దరు హీరోలు వచ్చి నిలదీయగా.. చివరకు ఆత్మహత్యాయత్నం చేస్తుంది ఆ సినిమాలోని హీరోయిన్. అయితే, అది సినిమా కాబట్టి అలా ఉంది. మరి నిజ జీవితంలోనూ అలా జరిగితే? జరిగితే ఏంటీ.. జరిగింది కూడా. ట్రయాంగిల్ స్టోరీ విషాదాంతమైంది. ఈ నిజ జీవిత కథలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపిన ‘బేబీ’ సినిమా చూశారా? చిన్న సినిమా అయినా.. పెద్ద హిట్టు కొట్టింది. కారణం అందులోని ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒకరిని ప్రేమిస్తూ.. మరొకరితోనూ చనువుగా ఉంటుంది. ఇదే విషయంపై ఇద్దరు హీరోలు వచ్చి నిలదీయగా.. చివరకు ఆత్మహత్యాయత్నం చేస్తుంది ఆ సినిమాలోని హీరోయిన్. అయితే, అది సినిమా కాబట్టి అలా ఉంది. మరి నిజ జీవితంలోనూ అలా జరిగితే? జరిగితే ఏంటీ.. జరిగింది కూడా. ట్రయాంగిల్ స్టోరీ విషాదాంతమైంది. ఈ నిజ జీవిత కథలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఊహతెలియని వయసులో ప్రేమ.. మైనారిటీ తీరకుండానే తాళి.. మైనారిటీ తినలేదని తెలిసినా ఒకే బాలికతో ఇద్దరు యువకుల ప్రేమాయణం..! వెరసి.. ఇద్దరి నిండు ప్రాణాలు బలిగొన్నది. విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది. ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది.
విశాఖ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది. ఏ ఘటనపై పోలీసుల విచారణ చేపట్టారు. దీంతో కీలక విషయాలకు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలికతో సూర్య ప్రకాష్, సాయికుమార్ అనే ఇద్దరు యువకులు ప్రేమలో పడ్డారు. ఇదే క్రమంలో సాయికుమార్ అనే యువకుడు.. ఓ గదిలో ఆమెకు తాళి కూడా కట్టేసాడు. బాలిక మరో యువకుడు సూర్యప్రకాష్ తో చనువుగా ఉండడం సాయి కుమార్ కు నచ్చలేదు. దీంతో ముగ్గురు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరిలో ఎవరు కావాలో తెలుసుకోవాలంటూ బాలికపైనే ఒత్తిడి గురి చేశారు ఇద్దరు యువకులు. దీంతో ఆ బాలిక ఎటు తెలుసుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకొని బలవనుమరనానికి పాల్పడింది.
రైల్వే ట్రాక్ పై యువకుడు..
బాధితురాలు తండ్రి ఫిర్యాదులతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు యువకులపై బాధితురాలు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఒత్తిడికి గురి చేయడం వల్లే బాలిక మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో విషయము తెలిసి ఆందోళన చెందిన సూర్య ప్రకాష్ అనే యువకుడు.. శుక్రవారం నాడు గోపాలపట్నం ఆర్ఆర్ క్యాబిన్ వద్ద రైలు కింద పడి మృతి చెందాడు. రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. అతని తల్లిదండ్రులకు చూపించడంతో సూర్యప్రకాష్ గా గుర్తుపట్టారు.
మరో యువకుడి అరెస్ట్..
అయితే పోలీసుల దర్యాప్తులో మూడో వ్యక్తి అయినా సాయికుమార్ ను అదుపులో తీసుకొని ప్రశ్నించారు పోలీసులు. విషయాన్ని అంతా పోలీసులకు వివరించాడు సాయికుమార్. దీంతో సాయికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
విషాదాన్ని నింపిన ఆ ప్రేమ..
తెలిసి తెలియని వయసులో బాలిక ప్రేమలో పడడం.. మైనారిటీ తీరలేదని తెలిసిన ఇద్దరు యువకులు ఆమెతో ప్రేమాయణంలో కొనసాగడమే కాకుండా.. ఆమెకు ఎవడు తాళికట్టడం.. ఇద్దరు కలిసి బాలికపై ఒత్తిడి తీసుకురావడం.. మనస్థాపనతో బాలిక ఆత్మహత్య చేసుకోవడం, ఆ వెంటనే ఇద్దరు యువకుల్లో ఓ యువకుడు రైలు కిందపడి బలవనమరడానికి పాలపడడం.. మరో యువకుడు కటకటాల్లోకి వెళ్లడం.. మూడు కుటుంబాల్లోనూ తీరని విషాదాన్ని నింపుతోంది. ఒక ప్రేమ వ్యవహారం ఇద్దరి ప్రాణాలు బలిగుంటే.. మరొకరిని కటకటలోకి నెట్టేసింది. పిల్లల్లో కూడా అవగాహన పెరగాలి.. పేరెంట్స్ మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..