Pawan Kalyan: విశాఖలో కొనసాగుతున్న వారాహి యాత్ర.. నేడు సాయంత్రం గాజువాకలో భారీ బహిరంగ సభ

మూడో విడత యాత్రలో భాగంగా విశాఖలో వారాహి రథం సందడి  చేస్తోంది. నేడు సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్  గాజువాకలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతేకాదు దసపల్లా భూముల్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Pawan Kalyan: విశాఖలో కొనసాగుతున్న వారాహి యాత్ర.. నేడు సాయంత్రం గాజువాకలో భారీ బహిరంగ సభ
Pawan Kalyan
Follow us
Surya Kala

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 13, 2023 | 3:13 PM

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో రాజకీయాల్లో ఎమోషనల్ మైండ్‌గేమ్‌ ఓ రేంజ్‌లో జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇందుకు కారణం పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనే. మూడో విడత యాత్రలో భాగంగా విశాఖలో వారాహి రథం సందడి  చేస్తోంది. నేడు సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్  గాజువాకలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతేకాదు దసపల్లా భూముల్ని సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖలో మూడోరోజు పర్యటించారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ఇటీవల వాలంటీర్‌ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. వాలంటీర్‌ వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇంకా చెప్పాలంటే.. వారాహి రెండో విడత యాత్రలోనే వాలంటీర్ల వ్యవస్థపై యుద్దం ప్రకటించిన పవన్‌కల్యాణ్. మూడో విడతలో ఆ యుద్దాన్ని మరింత తీవ్రతరం చేశారు. తన విమర్శలకు పదును పెంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..