Tomato Price: సామాన్యులకు షాక్ ఇస్తున్న కూరగాయల ధరలు.. సెంచరీ కొట్టిన టమాటా, పచ్చిమిర్చి
గత ఏడాది కూడా ఇదే సీజన్ లో టమాటా ధర మోత మ్రోగిపోయింది. ఎందుకంటే ఈ సీజన్ లో టమాటా దిగుబడి ఉండదు. పొరుగు రాష్ట్రాల నుంచి టమాటోలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి తక్కువగా ఉండడంతో వారంలోనే ఒక్కసారిగా టమాటా ధర రూ. 80 నుంచి రూ. 100కి పెరిగింది. మదనపల్లె మార్కెట్లో నిన్నా మొన్నటి వరకూ కేజీ రూ. 30 ఉన్న టమాటా ధర .. ప్రస్తుతం రూ. 60 నుంచి 70 మధ్య సాగుతుంది.
వేసవి సీజన్ ముగిసింది.. వర్షాకాలంలో అడుగు పెట్టాం.. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లో టమాటాతో పాటు పచ్చి మిర్చి ధర చుక్కలను తాకుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా టమాటాతో సహా వివిధ కూరగాయల ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. ఓ వైపు పప్పు ఉప్పుల ధరలు మ్రోత మొగిస్తుంటే ఇప్పుడు కూరగాయల ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ మార్కెట్ లో చూసినా కేజీ టమాటా ధర రూ. 80 నుంచి రూ.100 వరకూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లె, పలమనేరుతో పాటు కర్ణాటకలోని చింతామణితో పాటు ఇతర ప్రాంతాల నుంచి టమాటాలు తెలుగు రాష్ట్రాలకు దిగుమతి చేసుకుంటున్నారు.
వాస్తవానికి గత ఏడాది కూడా ఇదే సీజన్ లో టమాటా ధర మోత మ్రోగిపోయింది. ఎందుకంటే ఈ సీజన్ లో టమాటా దిగుబడి ఉండదు. పొరుగు రాష్ట్రాల నుంచి టమాటోలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి తక్కువగా ఉండడంతో వారంలోనే ఒక్కసారిగా టమాటా ధర రూ. 80 నుంచి రూ. 100కి పెరిగింది. మదనపల్లె మార్కెట్లో నిన్నా మొన్నటి వరకూ కేజీ రూ. 30 ఉన్న టమాటా ధర .. ప్రస్తుతం రూ. 60 నుంచి 70 మధ్య సాగుతుంది. ధర ఎంత పెరిగినా బహిరంగ మార్కెట్ లో లభిస్తున్న టమాటా చాలా నాసిరకంగా ఉంటుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
రైతు బజార్ల వద్ద క్యూ కడుతున్న సామాన్యులు
ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణాలోని ప్రతి మార్కెట్ లో టమోట ధరతో పాటు కురగాయాల ధరలు భారీగా పెరిగాయి. అయితే కొన్ని రైతు బజార్లో కిలో టమాట ధర రూ. 55 నుంచి రూ. 65 మధ్య సాగుతుంది. ఇటువంటి రైతు బజార్ల వద్ద సామాన్యులు క్యూలు కడుతున్నారు. టమాటా తో పాటు ఉల్లి పాయ, పచ్చి మిర్చి, బెండకాయ, బీరకాయ తో పాటు ఆకు కూరలు కూడా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. నిన్నా మొన్నటి వరకూ ఉల్లిపాయలు కేజీ ధర రూ. 20 ఉండగా.. ఇప్పుడు ఉల్లిపాయల ధర రూ. 50 నుంచి రూ. 60 మధ్య ఉంది. పచ్చి మిర్చి కేజీ రూ. 100లు ఉండగా.. బీరకాయలు, బెండకాయలు, గోరు చిక్కుడు, ఆనపకాయ వంటి కూరగాయలతో పాటు ఆకు కూరల ధరలు కూడా బాగా పెరిగాయి. దీంతో సామాన్యులు ఏమి కోనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదు అంటూ వాపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..