Lord Shiva Puja: కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందాలనుకుంటే సోమవారం శివయ్యను ఇలా పూజించండి..
ఎవరైనా శివుని అనుగ్రహం పొందాలనుకుంటే సోమవారం రోజున ఆచారాల ప్రకారం మహాదేవుని పూజించి, శివలింగానికి అభిషేకం చేయాలి. సోమవారం నాడు శివపార్వతులను పూజించడం ద్వారా జీవితంలో ఏర్పడే ప్రతి సంక్షోభాన్ని అధిగమించవచ్చు. సోమవారం పూజ సమయంలో శివలింగానికి ప్రత్యేక వస్తువులను సమర్పించాలి. శివలింగానికి నీటిని సమార్పిస్తూ క్రింద ఇవ్వబడిన మంత్రాలను జపించాలి.
హిందూ మతంలో సోమవారం త్రిమూర్తుల్లో లయకారుడైన శివునికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడిని ప్రత్యేకంగా పూజ చేస్తారు. అంతేకాదు శివయ్య అనుగ్రహం కోసం సోమవారం ఉపవాసం చేస్తారు. ఈ వ్రత పుణ్యం వల్లనే పరమశివుడు, పార్వతీదేవి వివాహం చేసుకున్నట్లు మత విశ్వాసం. సోమవారం ఉపవాసానికి విశేష ప్రాముఖ్యత ఉంది. వివాహిత స్త్రీలు తమ భర్త సంతోషం, అదృష్టం , దీర్ఘాయువు కోసం సోమవారం ఉపవాసం ఉంటారు. అదే సమయంలో పెళ్లికాని అమ్మాయిలు వివాహం కోసం, కోరుకున్న వరుడిని పొందడానికి సోమవార వ్రతాన్ని పాటిస్తారు.
అటువంటి పరిస్థితిలో ఎవరైనా శివుని అనుగ్రహం పొందాలనుకుంటే సోమవారం రోజున ఆచారాల ప్రకారం మహాదేవుని పూజించి, శివలింగానికి అభిషేకం చేయాలి. సోమవారం నాడు శివపార్వతులను పూజించడం ద్వారా జీవితంలో ఏర్పడే ప్రతి సంక్షోభాన్ని అధిగమించవచ్చు. సోమవారం పూజ సమయంలో శివలింగానికి ప్రత్యేక వస్తువులను సమర్పించాలి. శివలింగానికి నీటిని సమార్పిస్తూ క్రింద ఇవ్వబడిన మంత్రాలను జపించాలి.
సోమవారం శివలింగానికి అభిషేకం ఎలా చేయాలంటే
- సోమవారం నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి.
- శివాలయానికి వెళ్లి లింగానికి పెరుగు, పాలు, నెయ్యి, తేనె , గంగాజలం కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి.
- తర్వాత శివలింగంపై బిల్వ పత్రం, తమలపాకు, అక్షతం, పండ్లు మొదలైన వాటిని సమర్పించండి.
- దీని తరువాత, శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించండి. అనంతరం మహాదేవునికి ఆరతి ఇవ్వండి. మంత్రాలను జపించండి.
- చివరగా శివునికి పండ్లు, మిఠాయిలు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి.
- శివయ్యకు నైవేద్యంగా పంచిన ప్రసాదాన్ని తీసుకుని శివ ప్రసాదంగా ప్రజలకు ఆహారం , డబ్బును దానం చేయండి.
పూజ సమయంలో జపించాల్సిన మంత్రాలు ఏమిటంటే?
మహామృత్యుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి దేవుడు,సుగంధ భరితుడు అయిన శివున్ని మేము పుజిస్తున్నాము. పండు తొడిమ నుండి వేరుపడు విధముగా, మేము కూడా మరణము నుండి, మర్త్యత్వము నుండి విడుదల పొందాలి.
శివ గాయత్రీ మంత్రం
ఓం తత్పురుషాయ విద్మహే | మహాదేవాయ ధీమహి | తన్నో రుద్ర ప్రకోదయాత్ ||
శివ ఆరోగ్య మంత్రం
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ
ఓం త్ర్యమ్బకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
రుద్ర మంత్రం
ఓం నమో భగవతే రుద్రాయ నమః
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.