- Telugu News Photo Gallery Spiritual photos Astrology Morning Tips: These Tasks Done In The Morning Open The Way To Becoming Rich
Morning Astro Tips: ఉదయం నిద్ర లేచిన తర్వాత ఈ పనులు చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్ధిక ఇబ్బందులు కలుగవు..
ఉదయాన్నే మంచి పనులతో ప్రారంభిస్తే రోజంతా చక్కగా సాగుతుందని చెబుతారు. అంతేకాదు ప్రతి పనిలోనూ విజయాన్ని అందుకుంటారని నమ్మకం. అంతేకాదు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా కొనసాగుతాయి. ఎవరి జీవితంలోనైనా ఆర్థిక సమస్యలు ఉంటే.. రోజు నిద్ర లేచిన తర్వాత ఉదయం చేసే పనుల్లో కొన్ని మార్పులు చేయాలి. ఇలా చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తీరి సంపాదనా మార్గాలు పెరుగుతాయని విశ్వాసం.
Updated on: Jun 24, 2024 | 7:28 AM

రోజుని ఎలా మొదలు పెడతారో.. అదే విధంగా రోజంతా సాగుతుందని నమ్మకం. కనుక నిద్ర లేచిన వెంటనే శ్రీ కృష్ణుడి ముఖాన్ని చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ విషయం సనాతన శాస్త్రంలో చెప్పబడింది. బ్రహ్మ ముహర్తంలో మేల్కొంటే రోజంతా ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అంతే కాదు ఉదయం యోగా, ధ్యానం చేస్తే మనస్సు సానుకూలత, ఆధ్యాత్మికతతో నిండిపోతుందని అంటారు.

బ్రహ్మ ముహర్తంలో నిద్ర లేవడం మంచిది పెద్దలు చెబుతారు. ఇలా సూర్యోదయ సమయంలో నిద్ర లేవడం ఆరోగ్య పరంగానే కాదు.. ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, జీవితంలో విజయాలను అందుకుని శిఖరాగ్రానికి చేరుకోవడానికి కూడా కావాల్సిన మానసిక బలాన్ని ఇస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి కొన్ని రకాల ముఖ్యమైన పనులను చేయాలి. ఈ పనుల ఆధారంగా లక్ష్మీ దేవి అనుగ్రహం జీవితాంతం ఉంటుంది.

రోజూ పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఇంటి పూజా గదిలో ఆవు నెయ్యి.. అంటే స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వలన దేవుడి అనుగ్రహం లభిస్తుంది. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటరు. మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

రాత్రి సమయంలో రాగి పాత్రలో నీళ్లను నింపి అందులో తులసి దళాలను వేయాలి. తర్వాత ఆ తులసి నీళ్లను ఉదయాన్నే ఇల్లంతా చల్లాలి. ఇలా రోజూ చేయడం వల్ల ధనలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ కురుస్తుంది.

ప్రతిరోజూ ఉదయాన్నే అభ్యంగ స్నానం చేసి సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పిస్తే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. ఒక రాగి పాత్రలో నీళ్ళు నింపి కుంకుమ మందారం పువ్వులు వేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం ఆరోగ్యంగానే కాదు ప్రతి పనిలో విజయం సాధిస్తారని నమ్మకం.

భగవంతుని గురించి ధ్యానం చేయడానికి ఉదయం ఉత్తమంగా పరిగణించబడుతుంది. నిద్రలేచిన తర్వాత ఉదయం వేళ కొంత సమయం దేవుని సాధన కోసం కేటాయించండి. ప్రార్థన సమయంలో మీరు సాధించిన విజయానికి దేవునికి ధన్యవాదాలు.

హిందూ మతంలో ఆవులను చాలా పవిత్రంగా భావిస్తారు. చాలామంది గోమాతగా భావించి పూజిస్తారు. ఆవు శరీరంలో సకల దేవతలు కొలువై ఉంటారని హిందువులు నమ్ముతారు. కాబట్టి ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత గోవు సేవ లేదా పూజ చేయండి. గోవులను సేవించి పూజించే వారి పట్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నుడవుతారని చెబుతారు.





























