AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamuna Leaves: నేరేడు పండ్లు మాత్రమే కాదు.. నేరేడు ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయని తెలుసా..

నేరేడు పండ్లు మాత్రమే కాదు చెట్టు కూడా మానవులను అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. చెట్టుని కలపగా ఉపయోగిస్తారు. ఇక నేరేడు ఆకులు కూడా అనేక విధాలా  ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ నేరేడు ఆకులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నేరేడు ఆకుల్లో ఐరన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Jamuna Leaves: నేరేడు పండ్లు మాత్రమే కాదు.. నేరేడు ఆకులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయని తెలుసా..
Jamun Leaves
Surya Kala
|

Updated on: Jun 24, 2024 | 7:51 AM

Share

సీజనల్ ఫ్రూట్ నేరేడు పండ్లు.. వేసవి కాలం చివరిలో మొదలు పెట్టి ఆషాడ మాసం వరకూ ఈ నేరేడు పండ్లు మార్కెట్ లో సందడి చేస్తాయి. నలుపు రంగులో మిలమిలా మెరుస్తూ మంచి రుచితో పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే నేరేడు పండ్లలో అద్భుతమైన పోషకాలు కూడా ఉన్నాయి. ఈ  అద్భుతమైన పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నేరేడు పండ్లు మాత్రమే కాదు చెట్టు కూడా మానవులను అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. చెట్టుని కలపగా ఉపయోగిస్తారు. ఇక నేరేడు ఆకులు కూడా అనేక విధాలా  ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ నేరేడు ఆకులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి.

నేరేడు ఆకుల్లో ఐరన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కనుక ఈ రోజు నేరేడు ఆకుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

పుష్కలంగా యాంటీ హైపర్‌గ్లైసీమిక్

డయాబెటిస్‌  పేషేంట్స్ కు నేరేడు ఆకులు బెస్ట్ మెడిసిన్. రక్తంలో చక్కెర అధికంగా ఉన్నవారు నేరేడు  ఆకులను తీసుకోవడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే వీటిల్లో ఉండే యాంటీ-హైపర్‌గ్లైసీమిక్ లక్షణాలు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. నేరేడు ఆకులతో టీ తయారు చేసి త్రాగవచ్చు లేదా ఉదయం ఖాళీ కడుపుతో నమలవచ్చు.

ఇవి కూడా చదవండి

అయితే రక్తంలో లెవెల్స్ తక్కువగా ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు నేరేడు ఆకులను తినకూడదు.

గుండెకు ప్రయోజనం

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో నేరేడు ఆకుల వినియోగం కూడా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. వీటిల్లో పొటాషియం ఉంటుంది. కనుక నేరేడు ఆకులను నమలడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

నేరేడు ఆకులను తినడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు, నోటి దుర్వాసన, అల్సర్ మొదలైన వాటికి మేలు జరుగుతుంది. నోటిపూతతో ఇబ్బంది పడుతున్న వారు లేత నేరేడు ఆకులను నీటిలో వేసుకుని ఆ నీటిని  పుక్కిలించడం వలన ప్రయోజనం ఉంటుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఎవరైనా తరచుగా అజీర్ణంతో బాధపడుతుంటే.. నేరేడు ఆకులను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు జీర్ణశక్తిని బలోపేతం చేయడంతోపాటు అజీర్ణం, డయేరియా, అసిడిటీ వంటి సమస్యలను నివారిస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని ఆచరించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. )

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్