CM Jagan-PV Sindhu: సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు.. ఏపీలో అకాడమీ ఏర్పాటుపై చర్చ
CM Jagan-PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పాఠక విజేత పీవీ సింధు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు సచివాలయంలో..
CM Jagan-PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ కాంస్య పాఠక విజేత పీవీ సింధు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు సచివాలయంలో సీఎం ఛాంబర్లో జగన్ ను కలిసిన సింధు టోక్యో ఒలింపిక్స్ లో తాను గెలిచిన కాంస్య పతకాన్ని చూపించారు. ఒలింపిక్స్ లో వరసగా రెండు పతకాలను గెలిచి చరిత్ర సృష్టించిన సింధుని సీఎం జగన్ అభినందించారు. శాలువా తో సత్కరించారు. మీ ఆశీర్వాదంతో కాంస్యం సాధించానని సీఎం జగన్‌తో సింధు అన్నారు. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపారని సీఎం అభినందించారు
తాను సీఎం జగన్ ఆశీర్వాదంతోనే పతకాన్ని నెగ్గినని చెప్పారు. మెడల్ సాధించాలని తనని ప్రోత్సహించారని చెప్పారు. అంతేకాదు క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. ప్రభుత్వం అండగా ఉండే మరిన్ని పతకాలను సాధించడానికి అవకాశం ఉందని అన్నారు అంతేకాదు తాను త్వరలోనే ఏపీలో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేస్తానని తెలిపారు సింధు. దీంతో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. సింధు.. దేవుడి దయతో మంచి ప్రతిభ చూపిందని అన్నారు. అంతేకాదు త్వరలోనే విశాఖ పట్నంలో అకాడమీని ప్రారంభించాలని సూచించారు. ఏపీ నుంచి మరింతమంది సింధులు తయారు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కోరుతున్నారు. జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదు బహుమానాన్ని అధికారులు అందజేశారు.