తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం కేసులో క్లారిటీ.. ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ టెస్టులు.. ఏం తేలిందంటే

తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శశికళ గర్భవతి కాదని వైద్యులు నిర్ధారించారు. స్కానింగ్ తీసి రిపోర్టు పరిశీలించిన అనంతరం ఆమె గర్భవతి కాదని

తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం కేసులో క్లారిటీ.. ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ టెస్టులు.. ఏం తేలిందంటే
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 17, 2021 | 7:34 PM

తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శశికళ గర్భవతి కాదని వైద్యులు నిర్ధారించారు. స్కానింగ్ తీసి రిపోర్టు పరిశీలించిన అనంతరం ఆమె గర్భవతి కాదని అంకుర ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. శశికళ గర్భం దాల్చలేదని ఇప్పటికే మైథిలి హాస్పిటల్ వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వైద్యుల వాదనను శశికళ, ఆమె బంధువులు తప్పు పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రవేట్ ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో శశికళ గర్భం దాల్చలేదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో శశికళతో పాటు ఆమె బంధువులను పోలీసులు అరెస్ట్ చేసి.. అలిపిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అసలు ఏం జరిగిందంటే…

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన ఓ మహిళ కాన్పు కోసం తిరుపతి గవర్నమెంట్ ఆస్పత్రిలో ఈ నెల 16న చేరారు. అన్ని పరీక్షలు జరిపిన తర్వాత గర్భం ఉందని చెప్పిన వైద్యులు… ఆ తరువాత మాట మార్చారని సదరు మహిళ ఆరోపిస్తోంది. అంతేకాదు ఆసుపత్రిలో ఎప్పుడు చేరావంటూ తనను ప్రశ్నిస్తున్నారని ఆమె చెప్పారు. తనకు మత్తు మందు ఇచ్చి గర్భంలోని శిశువును తీసి మాయం చేశారని ఆరోపిస్తున్నారు. డాక్టర్లు అబద్ధమాడుతున్నారని ఆమె బంధువులు అన్నారు. న్యాయం చేయాలంటూ ఆదివారం ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో రంగప్రవేశం చేసిన అలిపిరి పోలీసులు.. ఆమెకు ప్రైవేట్ ఆస్పత్రిలో టెస్టులు చేయించి గర్భవతి కాలేదని నిర్ధారించారు.

Also Read:  వాటర్‌ట్యాంక్‌లో అస్థిపంజరాలు.. అవి పిల్లలవే అని స్థానికుల అనుమానం.. విచారించిన పోలీసులు ఏం తేల్చారంటే