AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు..!

భక్తులు కావాలంటే 10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. అయితే, లడ్డూల నిల్వను బట్టి ఈ సంఖ్య మారుతుందని గమనించగలరు..  దర్శన టికెట్ లేని వారు ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు లడ్డూలు పొందవచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కియోస్క్‌లు లడ్డూ కౌంటర్ సమీపంలో ఉన్నాయి. MBC విచారణ కేంద్రం, CRO కేంద్రం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో కూడా కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయి.

Tirumala: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదు..!
Tirumala Laddu'
Jyothi Gadda
|

Updated on: Jun 23, 2025 | 12:09 PM

Share

తిరుమల వెళ్లే భక్తులకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే..ఇకపై శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు..! తిరుమల లడ్డూ కౌంటర్లలో రద్దీని, సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. డిజిటల్‌ విధానంలో టిక్కెట్లు కొనుగోలు చేయగల కొత్త కియోస్క్‌లను టిటిడి ఏర్పాటు చేసింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని ఆదివారం ప్రారంభించింది టిటిడి. ఇందుకోసం భక్తులు తమ దర్శన టికెట్ నంబర్‌ను నమోదు చేసి, మీకు కావాల్సిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాలి. ఆ రసీదును లడ్డూ కౌంటర్‌లో ఇస్తే లడ్డూలను అందిస్తారు. ఈ విధానాన్ని కొద్ది రోజులు పరిశీలించనున్నారు. ఏవైనా లోటు పాట్లు ఉంటే దాన్ని బట్టి సవరణలు చేస్తారు.

భక్తులు కావాలంటే 10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. అయితే, లడ్డూల నిల్వను బట్టి ఈ సంఖ్య మారుతుందని గమనించగలరు..  దర్శన టికెట్ లేని వారు ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు లడ్డూలు పొందవచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కియోస్క్‌లు లడ్డూ కౌంటర్ సమీపంలో ఉన్నాయి. MBC విచారణ కేంద్రం, CRO కేంద్రం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో కూడా కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయి.

ఇదిలా ఉంటే, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 87,254 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 33,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చింది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 6 గంటలు, టికెట్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే