Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల..
Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం.. ఈరోజు (జులై6) రూ. 300 ల ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను విడుదల చేసింది టీటీడీ . ఈనెల 12, 15, 17 తేదీ ల్లో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
Tirumala News: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్ధం.. ఈరోజు (జులై6) రూ. 300 ల ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను విడుదల చేసింది టీటీడీ . ఈనెల 12, 15, 17 తేదీ ల్లో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వారు ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను గురువారం (జులై7) టీటీడీ విడుదల చేయనుంది. ఇక శుక్రవారం (జులై8) సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వేచిచూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ సూచించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను చూసి మోసోవద్దని హెచ్చరించింది.
కొనసాగుతోన్న రద్దీ..
ఇదిలా ఉంటే తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించినట్లు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం మొత్తం రూ.6.18 కోట్లు విరాళాలు వచ్చాయని ఇందులో తెలిపింది. ఇక వేసవి సెలవులు ముగుస్తుండటంతో గత రెండు రోజులుగా తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. దీంతో తిరుమలలోని అన్ని వసతి కౌంటర్ల వద్ద టీటీడీ అధికారులు ఉదయాన్నే ‘నో వేకెన్సీ’ బోర్డులను పెట్టారు. రద్దీ దృష్ట్యా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకే పరిమితం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలపై జూలై 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి.