Tirupati: ఆహా.. శ్రీవారిమెట్టు దగ్గర భక్తుల్ని ఇలా మాయ చేస్తున్నారనమాట

దళారులకు చెక్‌ పెట్టేందుకు TTD విజిలెన్స్‌ ఎంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నా.. భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. కొందరి దందా కంటిన్యూ అవుతూనే ఉంది.. తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర ఆటో డ్రైవర్లతో రింగైన కొందరు TTD సిబ్బంది.. టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీలో ఇష్టాతీరిన వ్యవహరిస్తున్నారు. ఈ తీరుపై భక్తులు భగ్గుమంటున్నారు.

Tirupati: ఆహా.. శ్రీవారిమెట్టు దగ్గర భక్తుల్ని ఇలా మాయ చేస్తున్నారనమాట
Tirumala Darshan
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 29, 2024 | 12:03 PM

తిరుపతి శ్రీవారిమెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. అక్కడ టైమ్‌స్లాట్‌ దర్శన టోకెన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నా దళారులకే టికెట్లు దక్కుతున్నాయని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారిమెట్టు దగ్గర రోజూ 3 వేల టోకెన్లను జారీ చేస్తుంది టీటీడీ..ఇక్కడే దళారుల దందా మొదలవుతుంది అనేది భక్తుల ఆరోపణ.. కొందరు ఆటో డ్రైవర్లు.. తాము తీసుకువస్తున్న భక్తులకు సమయం తర్వాత వచ్చినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని చెప్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో ఉన్న వారిని కాదని.. దొడ్డిదారిన ఆటోవాలాలతో డీల్‌ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు. భక్తుల్ని కంట్రోల్‌ చేయడంలోనూ, క్యూలైన్‌లలో ఏర్పాట్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు.

కొందరు టీటీడీ సిబ్బంది సహకారంతో, ఇక్కడ ఆటో డ్రైవర్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. దీనిపై నిలదీసినా తమకు సరైన సమాధానం రావడం లేదనేది భక్తుల మాట. వీకెండ్‌లు, సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు. శ్రీవారి మెట్టుమార్గం మీదుగా కొండకు వెళ్లేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. తెల్లవారుజామునుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుని నిరీక్షించినా ముందు వచ్చిన వారిని కాదని.. ఆటోల్లో వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

దళారులతో ఎదురయ్యే ఇబ్బందులు ఇలా ఉంటే.. అటు తిరుమల కొండపై రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.. క్యూలైన్‌ MBC వరకు ఉంటోంది. శనివారం శ్రీవారిని 78 వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు.  హుండీ ఆదాయం 3 కోట్ల 45 లక్షలు ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..