Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు హల్ చల్.. వణికిపోయిన శ్రీవారి భక్తులు
సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై మళ్లీ ఏనుగులు హల్ చల్ చేశాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను హడలెత్తించాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి.
సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై మళ్లీ ఏనుగులు హల్ చల్ చేశాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను హడలెత్తించాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసి ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఘాట్ రోడ్డు పక్కనే ఏనుగుల గుంపు హల్చల్ చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇక.. ఆ గుంపులో ఐదు ఏనుగులు, ఒక గున్న ఏనుగు ఉన్నాయి. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు.. ఏనుగుల గుంపును తిరిగి అడవిలోని పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా కొన్ని రోజులుగా శేషాచలం అడవుల్లోని ఏనుగులు చుట్టుపక్కల గ్రామాల్లోకి ప్రవేశిస్తూ హల్చల్ చేస్తున్నాయి. పంట పొలాలపై పడి బీభత్సం సృష్టిస్తున్నాయి.
ఏనుగులను అడవుల్లోకి తరిమేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నా.. ప్రతి రోజు ఏదో ప్రాంతంలో దాడులు చేస్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు. అలా ఇప్పుడు కూడా ఏనుగులు ఘాట్ రోడ్డులో హల్ చల్ చేశాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న భక్తులు, స్థానికులు ఏనుగులను చూశారు. వెంటనే వాటిని తమ ఫోన్లలో బంధించి ఫొటోలు, వీడియోలు తీశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..