AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Roja: మీకు నోరులేస్తే మేం చేతులతో సమాధానం చెబుతాం.. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమికొడతారు: మంత్రి రోజా

టీడీపీ కార్యకర్తలు నోటితో మాట్లాడితే తమ పార్టీ కార్యకర్తలు చేతులతో సమాధానం చెప్తారని మంత్రి రోజా హెచ్చరించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా SV యూనివర్సిటీ సెనేట్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Roja: మీకు నోరులేస్తే మేం చేతులతో సమాధానం చెబుతాం.. చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమికొడతారు: మంత్రి రోజా
Roja, Chandrababu Naidu
Basha Shek
|

Updated on: Feb 22, 2023 | 8:35 PM

Share

టీడీపీ కార్యకర్తలు నోటితో మాట్లాడితే తమ పార్టీ కార్యకర్తలు చేతులతో సమాధానం చెప్తారని మంత్రి రోజా హెచ్చరించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా SV యూనివర్సిటీ సెనేట్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల గన్నవరంలో చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించిన ఆమె.. వైసీపీ గుండాలు అంటూ టీడీపీ నేతలు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. దౌర్జన్యం, గూండాయిజం, సైకోయిజానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు, టీడీపీ నేతలేనని రోజా దుయ్యబట్టారు. టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పోలీసు వ్యవస్థను వాడుకోవడం బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబేనని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని, హైదరాబాద్‌ నుంచి చంద్రబాబును తరిమికొడతారని రోజా పేర్కొన్నారు. ‘గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయని.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేది. చంద్రబాబు తన వద్ద ఉన్న సైకోలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి అడ్రస్ లేకుండా చేస్తే.. చంద్రబాబు ఆంధ్రలో నుంచి పారిపోయి హైదరాబాద్‌లో ఉన్నారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబును హైదరాబాద్ నుంచి తరిమి కొడతారు. సీఎం జగన్ మంచి పని చేసినప్పుడల్లా ఆయనకు క్రెడిట్ రాకుండా ఉండేందుకు చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’

‘సీఎం జగన్ 18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే. దీనిని చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి. సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రధాని మోడీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మెచ్చుకుంటున్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోకుండా.. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. టీడీపీ రౌడీయిజం చేష్టలు, మాటలను చూసి ప్రజలు, కార్యకర్తలు విసిగిపోయారు. వాటిని ఇకమీద సహించేది లేది. టీడీపీ వాళ్లకు నోరులేస్తే తమ కార్యకర్తలు చేతులతో సమాధానం చెబుతారు’ అని రోజా హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..