తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.. లక్ష్మీపార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగు అకాడమీ పనితీరు చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుగు అకాడమీ చైర్మన్
Lakshmi Parvathi: తెలుగు అకాడమీ పనితీరు చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి చెప్పారు. ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించిందని ఆమె తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన తెలుగు బాషా చైతన్య సదస్సులు విజయవంతమయ్యాయని.. ఈ కార్యక్రమాల్లో సంస్కృత బాషా కవులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారని లక్ష్మీ పార్వతి వెల్లడించారు.
తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృతి అకాడమీ బాధ్యతలను సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించారని గుర్తు చేసుకున్న లక్ష్మీ పార్వతి.. లోయర్ క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు. పుస్తకాల ప్రింటింగ్ పూర్తి అయిందిని.. మరో పదిరోజుల్లో పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని ఆమె వెల్లడించారు.
తెలుగుదేశం ప్రభుత్వం వదిలేసిన తెలుగు అకాడమీని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చిందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమించడం చాలా సంతోషకరమని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.
Read also: Viral video: నా కారు ఆపుతావా అంటూ పోలీస్ అధికారి మీద నుంచి పోనిచ్చాడో డ్రైవర్.. వాచ్ వీడియో