YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. మరో కీలక వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శస్తోంది. మరోవైపు, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది వివేకా కూతురు సునితా రెడ్డి.
YS Viveka Murder Case Update: ఒకవైపు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు ప్రదర్శస్తోంది. మరోవైపు, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది వివేకా కూతురు సునితా రెడ్డి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.
ఇదిలావుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి రఘునాధ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో మొదటిసారిగా రఘునాధ్‌రెడ్డిని విచారించింది సీబీఐ. ఇతను సీఎం క్యాంపు కార్యాలయ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తుండటం విశేషం. వైసీపీ రాష్ట్రకార్యదర్శి శివశంకర్‌రెడ్డిని 7 గంటల పాటు సీబీఐ విచారించింది. గతంలో కూడా శివశంకర్‌రెడ్డిని సిట్, సీబీఐ బృందాలు ప్రశ్నించాయి. ఈ కేసులో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారు. మరోవైపు డాక్టర్ భరత్ రెడ్డిని కూడ సీబీఐ అధికారులు విచారించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలతో పాటు కీలకమైన డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సీబీఐ అధికారులు ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌కు సన్నిహితులు.. బంధువులను విచారిస్తుండడం రాజకీయంగా కలకలం రేపుతోంది. వారందరికీ హత్యతో ప్రమేయం ఉందా..? లేక రాజకీయ ఒత్తిడిలు ఏమైనా ఉన్నాయా అని వైసీపీ వర్గాలే చర్చించుకునేలా పరిస్థితి మారింది. కానీ, ప్రస్తుతం సీబీఐ దూకుడు చూస్తుంటే త్వరలోనే కేసు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు, ఇవాళ మరో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. విచారణ చేపట్టారు. వైఎస్ వివేకానంద కుమార్తె ఫిర్యాదు మేరకు.. మణికంఠ రెడ్డిని పులివెందుల పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో వైఎస్ వివేకా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్టు మణికంఠ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. వివేకా హత్య కేసు నిందితులతో ప్రాణహాని ఉందని శుక్రవారం ఎస్పీకి వైఎస్ సునీత లేఖ రాశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఇవాళ మణికంఠరెడ్డిని అదుపులోకి తీసుకున్న పులివెందుల డిఎస్పీ శ్రీనివాసులు విచారిస్తున్నట్లు తెలిపారు..
గత కొంతకాలంగా సీబీఐ విచారణ సాగుతున్నా.. ప్రస్తుతం అధికారులు తీరు మారినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరుల పేర్లు వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఇదిలావుంటే, వైఎస్ వివేకా హత్య కేసు –సీబీఐ విచారణకు సంబంధించి. వైఎస్ వివేకా కుమార్తె సునీత, తమ కుటుంబానికి రక్షణ కావాలని పోలీసుల్ని ఆశ్రయించగానే, తగిన భద్రతను కల్పించేందుకు పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంది. ప్రభుత్వం తరఫున చెయ్యాల్సింది చేస్తున్నామనీ, సీబీఐ విచారణ విషయమై మాట్లాడటానికీ ఏమీ లేదని మాత్రమే వైసీపీ నేతలు అంటున్నారు.Read Also… Minister Anil: నారా లోకేష్‌పై ఆయన తండ్రికి, టీడీపీ కార్యకర్తలకే నమ్మకంలేదు.. మంత్రి అనిల్ వ్యాఖ్యలు