Minister Anil: నారా లోకేష్‌పై ఆయన తండ్రికి, టీడీపీ కార్యకర్తలకే నమ్మకంలేదు.. మంత్రి అనిల్ వ్యాఖ్యలు

ఏపీలోని జగన్ సర్కారుపై  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన విమర్శలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తిప్పికొట్టారు.

Minister Anil: నారా లోకేష్‌పై ఆయన తండ్రికి, టీడీపీ కార్యకర్తలకే నమ్మకంలేదు.. మంత్రి అనిల్ వ్యాఖ్యలు
AP Minister Anil Kumar Yadav
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 14, 2021 | 3:42 PM

AP Minister Anil Kumar Yadav: ఏపీలోని జగన్ సర్కారుపై  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేసిన విమర్శలను ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తిప్పికొట్టారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర యువతకు ఉద్యోగం ఇవ్వలేదంటూ అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు. నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ యువకుడు కమల్‌ కుటుంబీకులను పరామర్శించేందుకు తాను వస్తుంటే వైసీపీ నాయకులు ఎందుకు భయపడుతున్నారంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై అనిల్ ఫైరయ్యారు. నారా లోకేష్ లాంటి పప్పు మహరాజ్‌ను చూసి బయపడేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరంటూ విరుచుకుపడ్డారు. బిడ్డ చనిపోయిన కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకువచ్చి చిల్లర రాజకీయాలు చేయడం సరికాదన్నారు. టీడీపీ జెండా మోసిన వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు టైమ్ లేదా? అని ప్రశ్నించారు.

సొంత తండ్రి, టీడీపీ కార్యకర్తలే నారా లోకేష్‌ని నమ్మే పరిస్తితిలో లేరని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి రాష్ట్రంలోని యువతకు భరోసా కల్పిస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. చేతకాని తనానికి కేర్ ఆఫ్ అడ్రస్ నారా లోకేష్.. ఆయన ఎవరికైనా ధైర్యం ఇవ్వగలడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read..

మంగళగిరి నరసింహస్వామి వారి ‘పానకం’ రేటెంతో తెలుసా..? అక్షరాలా రూ. ఒక కోటి 35 లక్షలు.!

పోలీసులకే సవాల్ విసిరింది.. అడ్డంగా బుక్కైంది.. ఎట్టకేలకు  బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్..