AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meera Mithun: పోలీసులకే సవాల్ విసిరింది.. అడ్డంగా బుక్కైంది.. ఎట్టకేలకు  బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్..

Meera Mithun:  గత కొద్ది రోజులుగా తన ఇష్టానుసారం సామాజిక వర్గాలపై.. సినీ ప్రముఖుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న తమిళ నటి..

Meera Mithun: పోలీసులకే సవాల్ విసిరింది.. అడ్డంగా బుక్కైంది.. ఎట్టకేలకు  బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్..
Meera Mithun
Rajitha Chanti
|

Updated on: Aug 14, 2021 | 3:31 PM

Share

Meera Mithun:  గత కొద్ది రోజులుగా తన ఇష్టానుసారం సామాజిక వర్గాలపై.. సినీ ప్రముఖుల పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న తమిళ నటి.. బిగ్‏బాస్ మాజీ కంటెస్టెంట్ మీరా మిథున్ అరెస్ట్ అయ్యింది. దళితులను కించపరుస్తూ.. తమిళ సినీ పరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమె చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వగా.. కేరళలో తలదాచుకున్న మీరా మీథున్‏ను ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

గత కొద్ది రోజులుగా మీరా మిథున్ సోషల్ మీడియా వేదికగా.. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను పోస్ట్ చేసింది. దళిత దర్శకులు, నటీనటులు సినీ పరిశ్రమలోకి రావడం వలనే తనకు అవకాశాలు రావడం లేదని.. వారిని ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని మీరా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు మరో 7 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆమెకు చెన్నై పోలీసులు నోటీసులు జారీచేశారు. అయితే మీరా అదేం పట్టనట్లుగా పోలీసులు పంపిన నోటీసులను బేఖాతరు చేసింది. మీరాను అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో తనను పోలీసులు అరెస్ట్ చేయడం జరగదని.. కేవలం కలలో మాత్రమే అరెస్ట్ చేయగలరు.. ఒకవేళ సాధ్యమైతే తనను ధైర్యంగా అరెస్ట్ చేసుకోవచ్చని పోలీసులకు సవాల్ విసిరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేరళలో తలదాచుకున్న మీరా మిథున్‏ను ఈరోజు అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆమె చెన్నైకి తీసుకువస్తున్నట్లుగా సమాచారం.

View this post on Instagram

A post shared by MeeraMitun (@meeramitun)

Also Read: Nikhil Siddharth: యంగ్ హీరో నిఖిల్‌‌‌ను సన్మానించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్.. ఎందుకంటే

Akhil Akkineni : అఖిల్ సినిమాకోసం హాలీవుడ్ యాక్షన్ ఫైట్ మాస్టర్స్.. ఛేజింగ్ ఎపిసోడ్ అదిరిపోతుందట..

Nagarjuna’s Bangarraju: పట్టాలెక్కనున్న బంగార్రాజు మూవీ.. సినిమా కోసం భారీ సెట్ కూడా రెడీ అయ్యిపోయిందట..

MAA Elections 2021: ముదురుతున్న ‘మా’ వివాదం.. ‘మా’ ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్న మాణిక్