- Telugu News Photo Gallery Cinema photos Independence day Telugu Movies to watch on Indian independence day celebrations weekend
Independence Day: దేశ భక్తిని నరనరాన నింపిన తెలుగు సినిమాలు ఇవే..
Independence Day Movies : స్వతంత్ర దినోత్సం.. మువ్వనేల జెండా రెపరెపలాడుతుంటే మనసంతా ఎదో హాయి నిండిపోతుంది. మూడు రంగుల జెండా ముందు నిలుచుంటే దేశభక్తి నరనరాన పాకుతుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల గురించి
Updated on: Aug 02, 2022 | 7:06 PM

స్వతంత్ర దినోత్సం.. మువ్వనేల జెండా రెపరెపలాడుతుంటే మనసంతా ఎదో హాయి నిండిపోతుంది. మూడు రంగుల జెండా ముందు నిలుచుంటే దేశభక్తి నరనరాన పాకుతుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల గురించి వింటుంటే గర్వంతో ఛాతి విరుచుకుంటుంది. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగులో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల గురించి తెలుసుకుందాం..

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఖడ్గం సినిమాను ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ముగ్గురు కలిసి నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా హిట్ అయ్యాయి. ఈ సినిమాలో దేశభక్తిని అద్భుతంగా చూపించారు.

అల్లూరి సీతారామరాజు. మన్యం వీరుడు అల్లూరి కథతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయన్నీఅందుకుంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతోపాటు దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన శుభాష్ చంద్ర బోస్ సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో వెంకటేష్ నటన ఆకట్టుకుంది.

ఇక శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా,, అకాగే అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది.




