Nagarjuna’s Bangarraju: పట్టాలెక్కనున్న బంగార్రాజు మూవీ.. సినిమా కోసం భారీ సెట్ కూడా రెడీ అయ్యిపోయిందట..

సోగ్గాడే చిన్ని నాయన సినిమా హిట్ తర్వాత ఆ సినిమాకు ప్రీక్వెల్‌‌‌గా బంగార్రాజు అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు నాగార్జున. సోగ్గాడే సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే

Nagarjuna's Bangarraju: పట్టాలెక్కనున్న బంగార్రాజు మూవీ.. సినిమా కోసం భారీ సెట్ కూడా రెడీ అయ్యిపోయిందట..
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 14, 2021 | 1:24 PM

Nagarjuna’s Bangarraju: సోగ్గాడే చిన్ని నాయన సినిమా హిట్ తర్వాత ఆ సినిమాకు ప్రీక్వెల్‌‌‌గా బంగార్రాజు అనే సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు నాగార్జున. సోగ్గాడే సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేయనున్నాడు. అయితే అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పట్టాలెక్కలేక పోయింది. కథలో నాగ్ మార్పులు చెప్పడం, ఆతర్వాత నాగ్ ఇతర సినిమాలతో బిజీ అవ్వడం.. ఆవెంటనే కరోనా ఎంటర్ అవ్వడం ఇలా అనేక కారణాల వల్ల బంగార్రాజు సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం అవ్వనుందని ఈ మధ్య వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే బంగార్రాజు సినిమా షూటింగ్ ఈ నెల 20వ తేదీన మొదలు పెట్టనున్నారనని తెలుస్తోంది. సోగ్గాడే చిన్ని నాయన భారీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రీక్వెల్‌‌‌‌తోనూ హిట్టు నాగ్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది.

అందుకు తగ్గట్టుగానే సినిమా బడ్జెట్ విషయంలో అసలు రాజీపడటంలేదట. ఈ నేపథ్యంలో బంగార్రాజు సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక భారీ సెట్ వేస్తూ వచ్చారు .. తాజాగా అది పూర్తయిందని తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ పర్యవేక్షణలో ఈ భారీ సెట్‌‌‌‌ను నిర్మించారు. టైటిల్‌‌‌‌కి తగినట్టుగా కథ గ్రామీణ నేపథ్యంలోనే నడుస్తుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. చైతూకి జోడీగా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి హీరోయిన్‌‌‌‌గా నటిస్తుందని టాక్. నాగార్జున సొంత బ్యానరులో నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

MAA Elections 2021: ముదురుతున్న ‘మా’ వివాదం.. ‘మా’ ప్రతిష్టను దిగజార్చుతున్న వారిపై తీసుకోవాలన్న మాణిక్

Nikhil Siddharth: యంగ్ హీరో నిఖిల్‌‌‌ను సన్మానించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్.. ఎందుకంటే

Netflix: ఢిల్లీ హైకోర్టులో నెట్‌ఫ్లిక్స్‌కు చుక్కెదురు.. బాలుడి మర్డర్ డాక్యుమెంటరీ ప్రసారానికి బ్రేక్..