Viral video: నా కారు ఆపుతావా అంటూ పోలీస్ అధికారి మీద నుంచి పోనిచ్చాడో డ్రైవర్.. వాచ్ వీడియో

పంద్రాగష్టు  దినోత్సవ ముందురోజు అనుమానాస్పద వాహనాల తనిఖీ డ్రైవ్ జరుగుతోంది. ఆ రోడ్‌లో పెద్ద సౌండ్‌తో

Viral video: నా కారు ఆపుతావా అంటూ పోలీస్ అధికారి మీద నుంచి పోనిచ్చాడో డ్రైవర్.. వాచ్ వీడియో
Car Driver Drags Cop
Follow us
Venkata Narayana

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 8:08 PM

Car driver drags cop: పంద్రాగష్టు  దినోత్సవ ముందురోజు అనుమానాస్పద వాహనాల తనిఖీ డ్రైవ్ జరుగుతోంది. ఆ రోడ్‌లో పెద్ద సౌండ్‌తో ఆడియో సిస్టమ్ పెట్టుకుని వెళ్తోన్న ఒక కారుని ఆపాడు ఒక పోలీసు అధికారి. నా.. కారునే ఆపుతావా అంటూ కార్ డ్రైవ్ చేస్తోన్న వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి లోనై ఏకంగా సదరు పోలీస్ అధికారిపైకే కారు ఎక్కించి తొక్కే ప్రయత్నం చేశాడు. పోలీస్ అధికారి కారుకి అడ్డంగా ఉన్నా.. ఏమాత్రం లెక్కచేయకుండా కారుతో పోలీస్ ని గుద్దుకుంటూ ముందుకు పోయాడు.

ఈ ఘటన పంజాబ్‌లోని పాటియాలా నగరంలోని లాలా భవన్ ప్రాంతంలో ఇవాళ చోటుచేసుకుంది. పోలీస్ అధికారి కారుకి అడ్డంగా ఉండి ఎంత వారిస్తున్నా వినకుండా కారు డ్రైవర్.. పోలీస్‌ని కారుతో గుద్దుకుంటూ ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో కొంత దూరం వరకూ కారు సదరు పోలీస్ అధికారిని నెట్టుకుంటూ ముందుకు పోయింది. అయినా కారుని ఏమాత్రం ఆపకుండా వాహనదారుడు ముందుకు వేగంగా పోనిచ్చాడు. దీంతో పోలీస్ అధికారికి గాయాలై రోడ్డు మీద పడిపోయాడు.

ఈ  దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.  ఘటనలో పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) కాలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. కారుని గుర్తించి డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, డ్రైవర్‌ను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్‌పై ఐపిసి 307 తో సహా సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

Read also: ‘చీకటి స్నేహాలు, అర్థరాత్రి కాళ్లు పట్టుకోడాలు, రహస్య సంసారాలు ఉండవు.. విలువ‌లనే పునాదులపై వెల‌సిన పార్టీ’

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ

హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!