‘చీకటి స్నేహాలు, అర్థరాత్రి కాళ్లు పట్టుకోడాలు, రహస్య సంసారాలు ఉండవు.. విలువలనే పునాదులపై వెలసిన పార్టీ’
చీకటి స్నేహాలు, అర్థరాత్రి కాళ్లు పట్టుకోడాలు, రహస్య సంసారాలు మాకుండవన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
Vijayasai Reddy – YSRCP: చీకటి స్నేహాలు, అర్థరాత్రి కాళ్లు పట్టుకోడాలు, రహస్య సంసారాలు మాకుండవన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విలువలనే పునాదులపై వెలసిన పార్టీ మాది అంటూ చెప్పుకొచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ చీకటి స్నేహాలు ఉండవని తేల్చి చెప్పారు.
ఒక వేళ ఏ పార్టీతోనైనా నిజంగా కలిసి పనిచేయాల్సి వస్తే మా అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగంగానే ప్రకటిస్తారని విజయసాయి వెల్లడించారు. చంద్రబాబులా అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకోవడాలు, చాటు మాటు స్నేహాలు, రహస్య సంసారాలు మాకుండవు. విలువల పునాదిపై వెలిసిన పార్టీ మాది అంటూ సాయి ట్వీట్ చేశారు.
‘అను’కుల’కోటను దాటి ఎల్లో మీడియా ఆలోచించలేకపోతోంది’ అని వ్యాఖ్యానించిన ఆయన, రాష్ట్ర పరిపాలన రాజధాని విశాఖపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని చెప్పుకొచ్చారు. బావిలో కప్పల్లా పచ్చమీడియా పైత్యం చూపించుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు.
ఏపీ అభివృద్ధికి విశాఖ చుక్కానీలాంటిదని యూకే హై కమిషనర్ ఫ్లెమింగ్ చెప్పారని విజయసాయి గుర్తు చేసుకున్నారు. అవకాశాలు మెండు, పెట్టుబడులకు అనుకూలం. రాజధానికి, నివాసయోగ్యానికి అనుకూలమైన నగరం మన విశాఖ అంటూ విజయసాయి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగం గురించి రాజకీయ నిరుద్యోగి లోకేశం మాట్లాడటం విడ్డూరం. జగన్ గారు అధికారంలోకి వచ్చాక 6 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు. చంద్రబాబు హయాంలో ఉన్న వాటినీ ఊడపీకారు. చరిత్ర తెలుసుకో లోకేశం. సినిమా డైలాగులు తర్వాత చెబుదువుగాని. ఉట్రాలు ఎప్పుడైనా రాయొచ్చు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 14, 2021
వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఏ పార్టీతోనూ చీకటి స్నేహాలు ఉండవు. నిజంగా కలిసి పనిచేయాల్సి వస్తే మా అధినేత జగన్ గారు బహిరంగంగానే ప్రకటిస్తారు. చంద్రబాబులా అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకోవడాలు, చాటు మాటు స్నేహాలు, రహస్య సంసారాలు మాకుండవు. విలువల పునాదిపై వెలిసిన పార్టీ మాది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 13, 2021
బావిలో కప్పల్లా పచ్చమీడియా పైత్యం చూపించుకుంటోంది. తన అను’కుల’కోటను దాటి ఆలోచించలేకపోతోంది. ఏపీ అభివృద్ధికి విశాఖ చుక్కానీలాంటిదని యూకే హై కమిషనర్ ఫ్లెమింగ్ చెప్పారు. అవకాశాలు మెండు, పెట్టుబడులకు అనుకూలం. రాజధానికి, నివాసయోగ్యానికి అనుకూలమైన నగరం మన విశాఖ.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 14, 2021
Read also: Ganja Gang War: గంజాయి గ్యాంగ్ వార్: కత్తులు, బండరాళ్లతో గల్లీలో కొట్టుకున్న ముఠా.. ఒకరు మృతి