Chittoor MP Reddappa: వైఎస్ఆర్‌సీపీ చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు అస్వస్థత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఈ సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైన రెడ్డప్పను హుటాహుటీన..
Chittoor MP Reddappa: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ఈ సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైన రెడ్డప్పను హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా గుండెలో సమస్య తలెత్తినట్టు గుర్తించిన డాక్టర్లు.. ఆయనకు పేస్ మేకర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఎంపీ రెడ్డప్పకు శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో రెడ్డప్ప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.
కాగా, ఎంపీ రెడ్డప్ప గతేడాది కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపీకి పార్లమెంట్ సచివాలయంలో నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఎటువంటి లక్షణాలు లేకుండానే కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన అప్పట్లో 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండి అనంతరం కోలుకున్నారు.
Read also : Crime News: బెల్లంపల్లిలో ఘోరం.. భార్య షాహీన్‌ను అతి కిరాతకంగా హత్య చేసిన భర్త.. అటు చిత్తూరులో..