లారీని ఢీకొట్టిన కారు, అదే కారుని వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టిన వైనం, నలుగురు స్పాట్ డెడ్
Road accident : గూడూరు సమీపంలో లారీని ఢీకొట్టింది కారు. ఆ కారును వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టింది...
Road accident : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గూడూరు సమీపంలో లారీని ఢీకొట్టింది కారు. ఆ కారును వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వీరయ్య, వరలక్ష్మి, మణికంఠ, స్వాతిగా గుర్తించారు. లిఖిత అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కారులో చిక్కుకున్నవాళ్లని బయటకు తీయడానికి ప్రొక్లైనర్లు, బుల్ డోజర్స్ తో కారుని పీలికలుగా లాగిల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read also : సిరిసిల్లలో బిజీ.. బిజీగా గడిపిన సీఎం.. ఓ వైపు చలోక్తులు, మరో వైపు అభివృద్ధి మాటలు, మరోచోట తీవ్ర అసహనం.!