Tirupathi: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇక వారికి వీఐపీ దర్శనం.. 5 గ్రాముల బంగారు డాలర్..
ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.. దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్షణం పాటు దొరికితే చాలని తపించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. . ఇక వీఐపీ బ్రేక్ దర్శనం కావాలంటే సిఫారసు ఉండాల్సిందే. అయితే అలాంటి వీఐపీ బ్రేక్ దర్శనం ఆ స్కీం దాతలకు లక్కే ఛాన్స్‌గా మారింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం మరింత ఈజీ అయ్యింది. టీటీడీ తీసుకున్న నిర్ణయంతో బ్రేక్ దర్శనమే కాదు వసతి, లడ్డు ప్రసాదం, శ్రీవారి బంగారు, వెండి డాలర్లు ఇలా ఎన్నో ఏటా పొందే అవకాశం లభించింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనాల ప్రివిలేజ్‌గా ఇవ్వాలని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయంతో అమల్లోకి వచ్చింది. ఈ మేరకు టీటీడీ ప్రొసీడింగ్స్ కూడా జారీ చేసింది. 2008లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని స్వర్ణమయం చేయాలని టీటీడీ అప్పట్లో సంకల్పించింది.
అయితే ఈ అంశం అప్పట్లో వివాదాస్పదం కావడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. కొన్ని అనివార్య కారణాలను చూపుతూ టీటీడీ ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకాన్ని నిలిపివేయాగా అప్పట్లో ఈ పథకానికి విరాళం ఇచ్చిన దాతలకు అర్చనానంతర దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆ స్కీం ఆగిపోవడం, ప్రస్తుతం అర్చనానంతర దర్శన సేవ లేకపోవడంతో ధర్మకర్తల మండలి ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి చెందిన దాతలకు ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం దాతలకు సవరించిన ప్రివిలేజెస్ అందుబాటులోకి వచ్చాయి. అర్చనానంతర దర్శనానికి బదులుగా గరిష్టంగా 5 మంది కుటుంబ సభ్యులకు ఏడాదిలో 3 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించనుంది. రూ.2,500/- టారిఫ్‌లో ఏడాదికి 3 రోజులు తిరుమలలో వసతి కల్పించనుంది టీటీడీ.. ఇక ఏడాదికి ఒకసారి 20 చిన్న లడ్డూలు ప్రసాదంగా అందించనుంది. దాతల దర్శన సమయంలో ఏడాదికి ఒకసారి బహుమానంగా ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ కూడా బహుమానంగా అందిస్తారు. ఇక దాత మొదటిసారి దర్శనానికి వచ్చిన సమయంలో 5 గ్రాముల బంగారు డాలర్, 50-గ్రాముల వెండి నాణెం బహుమానంగా కూడా టీటీడీ ఇవ్వనుంది. ఏడాదికి ఒకసారి పది మహాప్రసాదం ప్యాకెట్లు ఇవ్వనున్నంది. విరాళం పాస్‌బుక్ జారీ చేసిన తేదీ నుండి 25 ఏళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి