Andhra Pradesh: తిరుపతి జిల్లాలో దారుణం.. చిన్నారిపై అత్యాచారం, హత్య..

తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడున్నరేళ్ల బాలికపై అత్యాచారం, చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు సుశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిని అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి పూడ్చిపెట్టాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. బాలిక మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

Andhra Pradesh: తిరుపతి జిల్లాలో దారుణం.. చిన్నారిపై అత్యాచారం, హత్య..
Crime News
Follow us
Raju M P R

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 02, 2024 | 4:34 PM

తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎంపురం ఎస్టీ కాలనీలో దారుణం జరిగింది. మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం చేసి.. ఆతర్వాత హత్య చేశాడు నిందితుడు సుశాంత్. చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అత్యాచారయత్నం చేశాడు. అనంతరం చిన్నారిని స్కూలు వెనక ఉన్న పొలంలోకి తీసుకెళ్లి చంపేసి పూడ్చి పెట్టాడు. నిందితుడ్ని పోలీసులు.. అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటపడింది. సాయంత్రం నుంచి చిన్నారి కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అనుమానం వచ్చి కొందరిని విచారించారు. ఈ క్రమంలో ఎదురింట్లో ఉండే యువకుడు సుశాంత్ (22) పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకోని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిస్కెట్స్, చాక్లెట్లు ఆశ చూపి అత్యాచారానికి పాల్పడినట్లు అతను నిజం ఒప్పుకున్నాడు.. అనంతరం హతమార్చి గ్రామంలోని స్కూల్ వెనుకనే గుంత తీసి పూడ్చి పెట్టినట్లు చెప్పాడని పోలీసులు తెలిపారు.

నిందితుడి చెప్పిన వివరాలతో ఘటనా స్థలానికి అనుమానితున్ని తీసుకెళ్లి బాలిక శవాన్ని గుర్తించారు పోలీసులు. చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సుబ్బరాయుడు బాధిత కుటుంబంతో మాట్లాడారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది, అత్యంత హేయమైన చర్యని, నిందితుడు నేరం చేసినట్లు అంగీకరించాడని ఎస్పీ చెప్పారు. నిందితుడు బాలికకు వరుసకు మామ అవుతాడని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు ఎస్పీ.

ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ కూడా స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న గాలి భాను ప్రకాష్ చిన్నారిని హతమార్చిన హంతకుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడారు.

తిరుపతి జిల్లాలో చిన్నారిపై అత్యాచారయత్నం చేసి చంపిన ఘటనపై హోంమంత్రి సీరియస్ అయ్యారు. బాలికపై లైంగికదాడి, హత్య బాధాకరమని హోంమంత్రి అనిత చెప్పారు. గంటల వ్యవధిలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

కాగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీవో రామ్మోహన్.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆర్డీవో ప్రకటించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!