గండి వీరాంజనేయ స్వామి గుడి ముందు ఆగి ఉన్న కారులో మంటలు.. కారణం అదేనా?

హఠాత్తుగా ఉన్నట్టుండి స్కార్పియో వాహనం నుంచి మంటలు వ్యాపించడంతో ఏం జరిగిందో తెలియక అందరూ పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

గండి వీరాంజనేయ స్వామి గుడి ముందు ఆగి ఉన్న కారులో మంటలు.. కారణం అదేనా?
Car Fire Accident
Follow us
Sudhir Chappidi

| Edited By: Balaraju Goud

Updated on: Nov 02, 2024 | 4:19 PM

ఆకస్మికంగా జరిగే సంఘటనకు కారణాలు అవసరం లేదు. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి. అలాంటి సంఘటన ఇది దేవదర్శనానికి వెళ్లారు. దేవుని గుడి ముందు వాహనాన్ని పార్కింగ్ చేశారు. కొద్దిసేపటికే ఉన్నట్టుండీ, ఒక్కసారిగా వాహనం నుంచి మంటలు వ్యాపించాయి. అంతే దైవదర్శనానికి వచ్చిన భక్తులందరూ భయంతో పరుగులు తీశారు. గండి క్షేత్రంలోని ప్రాంగణంలో ఒక్కసారిగా స్కార్పియో వాహనంలో మంటలు రావడంతో భక్తులంతా పరుగు పెట్టారు.

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలోని గండి వీరాంజనేయ స్వామి క్షేత్రంలో స్కార్పియో వాహనం కాలిబూడిదైంది. ఒక్కసారిగా అంటుకున్న మంటలు.. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. బద్వేలు నియోజకవర్గానికి చెందిన కొంతమంది భక్తులు శనివారం కావడంతో గండి వీరాంజనేయ స్వామి దేవాలయంలో దర్శనానికి వెళ్లారు. అక్కడకు వెళ్లి దేవాలయ ప్రాంగణంలో వాహనాన్ని పార్కింగ్ చేసి దేవుని దర్శనానికి వెళ్ళగా, వాహనంలో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అయితే మంటలు వ్యాపించే సమయంలో చుట్టుపక్కల దేవాలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. హఠాత్తుగా ఉన్నట్టుండి స్కార్పియో వాహనం నుంచి మంటలు వ్యాపించడంతో ఏం జరిగిందో తెలియక అందరూ పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో, మంటలను అదుపు చేశారు. ఈలోపే చుట్టుపక్కల ఉన్న కొంతమంది భక్తులు దేవాలయంలోని వాటర్ పైపు ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది.

వాహనంలో మంటలు ఆరిన తర్వాత ఏమి జరిగిందని పరిశీలించగా, స్కార్పియో వాహనం ఎండలో పెట్టడం వలన ఎండ తీవ్రతకు ఒక్కసారిగా వాహనంలో ఉన్న బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లనే ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, అందువల్లే వాహనం కాలిందని నిర్ధారణకు వచ్చారు. ఏది ఏమైనా వాహనదారులు ఎప్పటికప్పుడు వాహనాన్ని పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు జరిగి వాహనం తగలబడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఆ సమయంలో వాహనంలో ఎవరూ లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే, ప్రాణా నష్టం జరిగి ఉండేదని ఘటన చూస్తే అర్థమవుతుంది. వాహనదారులు ఎప్పటికప్పుడు తమ వాహనాలను పరిశీలించి చెక్ చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..