CM Chandrababu: ఖబడ్దార్.. ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై తీవ్రంగా స్పందించారు. నిందితులకు కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. ఇటువంటి నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని.. ఖబడ్ధార్ అంటూ హెచ్చరించారు.

CM Chandrababu: ఖబడ్దార్.. ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
CM Chandrababu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 02, 2024 | 4:15 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అనకాపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అత్యాచార ఘటనలపై స్పందించిన చంద్రబాబు.. నిందితులకు అదే చివరి రోజు అవుతుంది.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. చిన్న పిల్లలపై అత్యాచారాలు చేస్తున్నారంటే వీళ్లు మనుషులేనా? అని ప్రశ్నించారు సీఎం చంద్రబాబు. గంజాయి, మద్యం వల్లే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. ఇద్దరు, ముగ్గురిని నడిరోడ్డుపై ఉరితీస్తేనే అలాంటివాళ్లు దారికొస్తారన్నారు. ఆడపిల్ల అంటే విలాస వస్తువు కాదు. ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే చివరిరోజు అవుతుందని నేరస్తులను హెచ్చరించారు. మామూలుగా వదిలిపెడితే కంట్రోల్ లోకి రారని.. ఒళ్లు వణికెటట్లు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి నేరస్థులకు అదే చివరి రోజు కావాలి.. అదే చీకటి రోజు కావాలంటూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానంటూ పేర్కొన్నారు. ఇదే తన హెచ్చరిక అని.. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. ఆడపిల్లలు విలాస వస్తువులు కాదని.. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని.. అలాంటి నేరస్తులను వెంటనే వారిని గుర్తించి మక్కెలు విరగ్గొట్టేలా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. చట్టాలను సైతం కఠినతరం చేశామని.. వెంటనే శిక్షలు పడేలా చేస్తామని పేర్కొన్నారు.

వీడియో చూడండి..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కార్ చేపట్టింది. వెన్నెలపాలెంలో రోడ్ల మరమ్మత్తుల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్వయంగా పారపట్టి గుంతల్లో మట్టి పోశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రవ్యాప్తంగా గోతులు పడిన రహదారులకు సంక్రాంతి నాటికి మరమ్మత్తులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం 350 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో పాటు మరో రూ.220 కోట్ల మేర రాష్ట్ర విపత్తుల నిధి నుంచి కూడా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..