Driver Dance: డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!

Driver Dance: డ్యాన్స్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ కి నారా లోకేష్ బంపర్ ఆఫర్.!

Anil kumar poka

|

Updated on: Nov 02, 2024 | 5:09 PM

కాకినాడ జిల్లా తుని డిపోలో విధులు నిర్వహిస్తున్న లోవరాజు అనే వ్యక్తి గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్‌గా జాబ్ చేస్తున్నాడు. లోవరాజుకు చిన్నతనం నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. ఈ నేపథ్యంలో తను బస్సు డ్రైవింగ్ చేస్తుండగా రోడ్డు సరిగా లేకపోవడంతో బస్సును ఒక దగ్గర ఆపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా బస్సులో ఉన్న స్కూల్ పిల్లలు డ్యాన్స్ చేయాలని లోవరాజును కోరారు.

పిల్లల కోరికను కాదనలేక బస్సు ఎదుట డ్రైవర్ డ్యాన్స్ చేశాడు. అతడు డ్యాన్స్ చేస్తుండగా పిల్లలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌కు స్పందించారు. ’డ్యాన్స్ సూపర్ బ్రదర్! ఇలానే కొనసాగించు! బస్సు ప్రయాణికులు నీ డ్యాన్స్ చూసి ఆస్వాదించినట్లు భావిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు. అయినా ఆర్టీసీ అధికారులు లోవరాజు ఉద్యోగం పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ డ్యాన్స్ వల్ల ఉద్యోగం తొలగించడంపై సర్వత్రా విమర్శలు చేశారు. లోవరాజుకి భార్య, ముగ్గురు పిల్లలు. తనకు ఈ ఉద్యోగం లేకపోతే తన ఫ్యామిలీ రోడ్డుపై పడుతుంది అని లోవరాజు బోరున విలపించాడు. డ్రైవింగ్ తప్ప వేరే పనేమీ చేయలేనంటున్న లోవరాజు తీవ్రంగా ఆవేదన చెందాడు. ఇది మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లడంతో.. ఆయన మరో ట్వీట్ చేశారు. నీ ఉద్యోగానికి ఏ ఢోకా లేదు అని అందులో రాసుకొచ్చారు. ఏది ఏమైనా తన ఉద్యోగానికి ఢోకా లేదు అని సాక్షాత్తు లోకేష్ మరోసారి ట్వీట్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు లోవరాజు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.