AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: అరగంటలో శ్రీవారి దర్శనం.. అది కూడా 5 అడుగుల దూరంలోనే.. కట్‌చేస్తే..

తిరుమలకు వెళ్తున్నారా?.. త్వరగా శ్రీవారి దర్శనం కావాలా? కేవలం 5 అడుగుల దూరం నుంచే స్వామివారిని దర్శించుకోవచ్చంటూ సోషల్‌ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ భక్తులను బురిడీ కొట్టిస్తున్న ఓ కేటుగాడికి ఎట్టకేలకు చెక్‌ పెట్టారు పోలీసులు. నిందితుడు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన సెంథిల్ కుమార్‌గా గుర్తించారు.

Tirumala: అరగంటలో శ్రీవారి దర్శనం.. అది కూడా 5 అడుగుల దూరంలోనే.. కట్‌చేస్తే..
Ttd Fake Tickets (1)
Raju M P R
| Edited By: |

Updated on: Apr 10, 2026 | 1:23 PM

Share

టీటీడీ లోగోను దుర్వినియోగం చేస్తూ.. శ్రీవారి విఐపి దర్శనం పేరుతో భక్తులను మోసం చేస్తున్న తమిళనాడుకు చెందిన సెంథిల్ కుమార్‌ను అనే వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశారు పోలీసులు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టా వేదికగా ప్రకటనలు చేస్తూ త్వరితగతిన శ్రీవారి దర్శనం, 5 అడుగుల దూరంలో దర్శనమంటూ ఇతను భక్తుల బురిడీ కొట్టించినట్టు పోలీసుల గుర్తించారు. ఇలా భక్తల నుంచి ఒక్కో టిక్కెట్‌కు రూ 16,500 వరకు వసూలు చేసినట్టు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు.

దీంతో అతని దగ్గర నుంచి టిటిడి లోగోతో పాటు ల్యాప్‌టాప్, రెండు మొబైల్స్, టికెట్స్ బుకింగ్ డేటా, AI వీడియోలు, సోషల్ మీడియా చాట్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇతనిపై తిరుమల వన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.16/2026 U/s 318(4) BNS, తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.12/2026 U/s 353(2), 298 BNS కేసులను ఇతనిపై పోలీసులు నమోదు చేసారు.

భక్తులకు టీటీడీ సూచనలు రోజురోజుకూ నకిళీ గాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు టీటీడీ కీలక సూచనలు జారీ చేసింది. శ్రీవారి దర్శన టికెట్లను కేవలం అధికారిక TTD వెబ్‌సైట్ లేదా అనుమతించబడిన కౌంటర్ల ద్వారా మాత్రమే పొందాలని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం ఉన్నప్పుడు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసు యంత్రాంగం కోరింది. ఎవరికీ ముందస్తుగా డబ్బులు చెల్లించవద్దని తెలిపింది. గూగుల్ సెర్చ్‌లో నందకం, రాంబగీచ, పాంచజన్యం, పద్మావతి గెస్ట్ హౌస్ పేర్లతో కనిపించే వెబ్‌సైట్ లింకులు అన్ని అధికారికమైనవి కావని తెలిపింది.

అధికారిక TTD వెబ్‌సైట్‌ http://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే భక్తులు వినియోగించమని కోరుతోంది. స్వామివారి దర్శనాలు, రూముల పేరుతో శ్రీవారి భక్తులను మోసం చేసే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని.. ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన తీసుకుంటామని పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముగ్గురు కేంద్ర ఉన్నతాధికారులను బలి తీసుకున్న ప్రమాదం!
ముగ్గురు కేంద్ర ఉన్నతాధికారులను బలి తీసుకున్న ప్రమాదం!
వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న శుక్రుడు.. ఊహించని ధనలాభాలు!
ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు?
ఇంటికి కొబ్బరికాయను బట్టలో చుట్టి ఎందుకు కడతారు?
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
రోజూ గుప్పెడు వేయించిన శనగలు తింటే..మీ ఒంట్లో ఏం జరుగుతుందంటే..
ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
ఊహకు అందని క్లైమాక్స్ మెప్పించిందా..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. తులం ఎంతుందంటే..
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' రివ్యూ.. రాజమౌళి కొడుకు హిట్ కొట్టారా?
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
పిండ దానం చేయాలంటే ఈ 5 పుణ్యక్షేత్రాలు.. పితృ పక్షంలో ప్రత్యేక...
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి
లక్ష్మీ కటాక్షం కోసం.. శుక్రవారం రాశుల వారీగా ఈ మంత్రాలు జపించండి