AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. టీమిండియా టూర్ లేక రూ.627 కోట్ల నష్టమా..? యాషెస్ సిరీస్ ఆడినా తీరని లోటు..!

England Cricket Board Loss: ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB)కు 2027లో భారీ ఆర్థిక నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. సొంతగడ్డపై భారత్‌తో మ్యాచ్‌లు లేకపోవడం, ఐసీసీ ఆదాయ పంపిణీకి సంబంధించిన పరిణామాలు బోర్డుపై ప్రభావం చూపనున్నాయి. ఏకంగా 50 మిలియన్ పౌండ్ల వరకు నష్టం రావచ్చని అంచనా వేస్తుండటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వామ్మో.. టీమిండియా టూర్ లేక రూ.627 కోట్ల నష్టమా..? యాషెస్ సిరీస్ ఆడినా తీరని లోటు..!
Ind Vs Eng Loss
Venkata Chari
|

Updated on: Nov 09, 2026 | 4:25 PM

Share

England Cricket Board Loss: ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్నమైన బోర్డుల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కు 2027లో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది బోర్డుకు భారీ నష్టాలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నష్టం గరిష్టంగా 50 మిలియన్ పౌండ్లు ఉండవచ్చని బ్రిటిష్ మీడియా కథనాలు వెల్లడించాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.627 కోట్లకు సమానం. సొంతగడ్డపై భారత్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌లు లేకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కనిపిస్తోంది.

టీమిండియా టూర్ లేకపోవడమే ప్రధాన సమస్య!

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు భారత్‌తో జరిగే సిరీస్‌లు భారీ ఆదాయాన్ని తీసుకొస్తాయి. టీమిండియా (Team India) మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రేక్షకాదరణ ఉండటంతో ప్రసార హక్కులు, టికెట్ల విక్రయాలు, స్పాన్సర్‌షిప్‌ల రూపంలో గణనీయమైన ఆదాయం లభిస్తుంది. అయితే 2027లో ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు పర్యటన లేకపోవడంతో ఈ ఆదాయానికి గండి పడనుంది. దీంతో బోర్డు ఆర్థిక అంచనాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఎక్కువమంది చదివినది: 109 పరుగులే టార్గెట్.. 7 వికెట్లు పడినా భారత్ ఎలా గెలిచింది.. డీఎల్‌ఎస్ మెథడ్ పూర్తి లెక్క ఇదే..!

ఇవి కూడా చదవండి

యాషెస్ సిరీస్ ఉన్నా తప్పని నష్టాలు!

2027 వేసవిలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా (Australia) మధ్య ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ (The Ashes) జరగనుంది. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్‌లో భారీ క్రేజ్ ఉంటుంది. అయినప్పటికీ భారత్‌తో జరిగే సిరీస్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని యాషెస్ ఒక్కటే భర్తీ చేయలేకపోవచ్చని అంచనా. అందుకే సొంతగడ్డపై పెద్ద సిరీస్‌కు ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ ECB నష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

ఐసీసీ ఆదాయ పంపిణీ కూడా ప్రభావం చూపనుందా?

బ్రిటిష్ మీడియా సంస్థ ‘ది గార్డియన్’ కథనం ప్రకారం, 2027లో ECB భారీ నష్టాలను అంచనా వేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. భారత్‌తో హోమ్ సిరీస్ లేకపోవడంతో పాటు ఐసీసీ ఆదాయ పంపిణీకి సంబంధించిన అంశాలు కూడా బోర్డు ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపనున్నాయి. ఐసీసీ ఆదాయాన్ని నిలిపివేయడం లేదా పంపిణీలో మార్పులపై పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ, ఈ అంశం కూడా చర్చలో ఉంది.

ఎక్కువమంది చదివినది: SRH Retention List: కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?

మొత్తానికి ప్రపంచ క్రికెట్‌లో భారీ ఆదాయాన్ని ఆర్జించే ECBకు సైతం భారత్‌తో సిరీస్‌ల ప్రాధాన్యత ఎంత ఎక్కువో ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. 2027లో అంచనా వేస్తున్న నష్టాలను తగ్గించేందుకు ఇంగ్లండ్ బోర్డు ఎలాంటి ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఓటీటీలోకి రణబాలి.. ఎక్కడ.? ఎప్పుడు చూడొచ్చంటే
ఓటీటీలోకి రణబాలి.. ఎక్కడ.? ఎప్పుడు చూడొచ్చంటే
వామ్మో.. టీమిండియా టూర్ లేక రూ.627 కోట్ల నష్టమా..?
వామ్మో.. టీమిండియా టూర్ లేక రూ.627 కోట్ల నష్టమా..?
దీపావళికి మరమరాలు మిగిలిపోయాయా? కమ్మటి బర్ఫీ తయారు చేసుకోండిలా..
దీపావళికి మరమరాలు మిగిలిపోయాయా? కమ్మటి బర్ఫీ తయారు చేసుకోండిలా..
రాహుల్‌లో ఆ ఒక్క లక్షణం భలే నచ్చింది.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాహుల్‌లో ఆ ఒక్క లక్షణం భలే నచ్చింది.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
3 రాష్ట్రాలు.. 3 భాషలు.. 2 నదులు.. ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ అద్భుత
3 రాష్ట్రాలు.. 3 భాషలు.. 2 నదులు.. ఆంధ్రా సరిహద్దుల్లోని ఈ అద్భుత
రూ.10తో ఈ కార్డు తీసుకుంటే ప్రతీ నెలా రూ.10 వేలు..
రూ.10తో ఈ కార్డు తీసుకుంటే ప్రతీ నెలా రూ.10 వేలు..
ఇరాన్‌కు ఆయుధాల సరఫరా కట్‌ చేసేందుకు అమెరికా కొత్త వ్యూహం!
ఇరాన్‌కు ఆయుధాల సరఫరా కట్‌ చేసేందుకు అమెరికా కొత్త వ్యూహం!
విదేశీ ఎయిర్‌పోర్టులో భారతీయుల బంతి భోజనాలు.. పారిశ్రామికవేత్త
విదేశీ ఎయిర్‌పోర్టులో భారతీయుల బంతి భోజనాలు.. పారిశ్రామికవేత్త
హార్దిక్ పాండ్యా వెళ్లిపోతే ముంబైకి నష్టం కంటే లాభమే ఎక్కువట
హార్దిక్ పాండ్యా వెళ్లిపోతే ముంబైకి నష్టం కంటే లాభమే ఎక్కువట
క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. 137 రకాల మందుల ధరలు 96శాతం..
క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. 137 రకాల మందుల ధరలు 96శాతం..