AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH Retention List: కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?

SRH Retention List: ఐపీఎల్ 2027కు ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్న SRH.. ఇప్పుడు రిటెన్షన్ జాబితాపై దృష్టి పెట్టింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి స్టార్లను కొనసాగిస్తూ, పాట్ కమిన్స్ సహా పలువురిని విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం ఆసక్తి రేపుతోంది.

SRH Retention List: కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?
Srh Retention List
Venkata Chari
|

Updated on: Nov 08, 2026 | 1:03 PM

Share

SRH Retention List: ఐపీఎల్ 2027 (IPL 2027) మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. డిసెంబర్ 16న గోవాలో వేలం జరిగే అవకాశం ఉండటంతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. నవంబర్ 17లోపు ఆటగాళ్లను కొనసాగించాలా? విడుదల చేయాలా? అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు ఎంపికపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా యజమాని కావ్య మారన్ (Kavya Maran) ఎవరిని కొనసాగిస్తారు? ఎవరికి వీడ్కోలు చెబుతారు? అనే చర్చ జరుగుతోంది.

ట్రేడింగ్ ద్వారా ముగ్గురు కొత్త ఆటగాళ్లు..!

రిటెన్షన్ జాబితా ఖరారు చేసే ముందే హైదరాబాద్ జట్టు ట్రేడింగ్ ద్వారా కీలక మార్పులు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి టీ నటరాజన్ (T Natarajan)ను జట్టులోకి తీసుకుంది. ఇందుకోసం జీషాన్ అన్సారీని ట్రేడ్ చేసినట్లు సమాచారం. నటరాజన్ కోసం రూ.5 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినది: మొన్న 185, నిన్న 134.. రేపు 100కే ఆలౌట్ చేస్తారేమో.. భారత బౌలర్లను చూస్తే భయమేస్తోంది..!

అలాగే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ట్రేడ్‌లో భాగంగా లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్‌లను పంపించి ఖలీల్ అహ్మద్ (Khaleel Ahmed), నాథన్ ఎల్లిస్ (Nathan Ellis)లను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం. ఖలీల్ గతంలోనూ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పుడు మళ్లీ తన పాత జట్టులోకి వచ్చాడు. అతడి ధర రూ.4.8 కోట్లు కాగా, నాథన్ ఎల్లిస్‌కు రూ.2 కోట్లు కేటాయించినట్లు కథనం పేర్కొంది.

అభిషేక్, ఇషాన్ సహా ఈ స్టార్లు రిటైన్..?

హైదరాబాద్ జట్టు ప్రధానంగా తన విధ్వంసకర బ్యాటింగ్ లైనప్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ (Abhishek Sharma), ఇషాన్ కిషన్ (Ishan Kishan), ట్రావిస్ హెడ్ (Travis Head), హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen)లకు రిటెన్షన్ దక్కే అవకాశం ఉంది.

వీరితో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, సలిల్ అరోరా, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ వంటి యువ ఆటగాళ్లను కూడా కొనసాగించే అవకాశముంది.

పాట్ కమిన్స్‌కు ఉద్వాసన పలుకుతారా..?

SRH అభిమానుల్లో ఎక్కువ ఆసక్తి రేపుతున్న అంశం కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) భవిష్యత్తు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా జట్టుకు టెస్టు క్రికెట్‌తో పాటు వన్డే ప్రపంచకప్ బాధ్యతలు ఉండటంతో అతడి అందుబాటుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అతడు వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండలేనని ఫ్రాంచైజీకి తెలియజేస్తే విడుదల చేసే అవకాశం ఉందని కథనం పేర్కొంది.

ఎక్కువమంది చదివినది: కోహ్లీపైకి ప్లాస్టిక్ బ్యాట్ విసిరిన అభిమాని.. విరాట్ చేసిన పనితో అంతా ఫిదా..!

ఇక హర్షల్ పటేల్ (Harshal Patel), జయదేవ్ ఉనద్కత్ (Jaydev Unadkat), దిల్షాన్ మధుశంక, ఆర్ఎస్ అంబ్రిష్, అనికేత్ వర్మ, ఓంకార్ తరమలే, శివమ్ మావి కూడా విడుదలయ్యే ఆటగాళ్ల జాబితాలో ఉన్నట్లు సమాచారం.

SRH సంభావ్య రిటెన్షన్ జాబితా..

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, సలిల్ అరోరా, శివాంగ్ కుమార్, క్రేన్స్ ఫులేత్రా, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, అమిత్ కుమార్, స్మరణ్ రవిచంద్రన్.

SRH సంభావ్య విడుదల జాబితా..

పాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, దిల్షాన్ మధుశంక, ఆర్ఎస్ అంబ్రిష్, అనికేత్ వర్మ, ఓంకార్ తరమలే, శివమ్ మావి.

ఈ జాబితాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమే. హైదరాబాద్ ఫ్రాంచైజీ అధికారిక రిటెన్షన్ ప్రకటనతోనే ఎవరెవరు జట్టులో కొనసాగుతారనే విషయంలో స్పష్టత రానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?
కమిన్స్‌కు కావ్య మారన్ షాక్.. హైదరాబాద్ నుంచి ఆ 8 మంది ఔట్?
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
సుధీర్, వర్షిణీ సేఫ్.. బిగ్ బాస్10 ఎలిమినేషన్ లో ఊహించని ట్విస్ట్
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..!
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..
దీపావళీ బరిలో సూర్య సెన్సేషన్.. సీన్ సినిమాతో రికార్డులు..
చేతులెత్తేసిన సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు.. పోరాడుతోన్న అర్జున్
చేతులెత్తేసిన సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులు.. పోరాడుతోన్న అర్జున్
చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!
చిన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నుంచి రూ. 277 కోట్ల వ్యాపారం వరకు!
నెల పాటు నిల్వ ఉండే కమ్మని టమాటా పచ్చడి.. కడుపునిండా తినేస్తారు!
నెల పాటు నిల్వ ఉండే కమ్మని టమాటా పచ్చడి.. కడుపునిండా తినేస్తారు!
తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!
తెలంగాణ గ్రామాలకు గుడ్‌న్యూస్.. ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్!
ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు
ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు
రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!
రెండు వన్డేల్లో గెలిచినా.. ఈ ముగ్గురితో గంభీర్‌కు టెన్షనే..!