AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అలిపిరి నడకమార్గం లో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచారం

Alipiri: గతంలో దాడులు చేసిన ప్రాంతంలోనే రెండు చిరుతల సంచారాన్ని గుర్తించిన సిబ్బంది....భధ్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారిలో 24 న రాత్రి 8 గంటల సమయంలో చిరుత సంచారంపై కెమెరా ట్రాప్ లో గుర్తించారు. 10 రోజుల్లో రెండుసార్లు చిరుత సంచారం అందరిలో వణుకుపుట్టిస్తోంది. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తం ఉండాలంటున్న అటవీశాఖ అధికారులు.

Andhra Pradesh: అలిపిరి నడకమార్గం లో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచారం
Tml Chiruta Sancharam
Raju M P R
| Edited By: |

Updated on: Oct 28, 2023 | 7:43 AM

Share

తిరుపతిలో మళ్లీ పులి, ఎలుగుబంటి కలకలం రేపింది. అక్టోబర్‌ 24, 25వ తేదీ రాత్రి అలిపిరి నడక మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగుబంటి సంచారం అందరిలో భయాందోళనలు రేకిత్తించింది. తిరుపతిలో పాదయాత్ర మార్గంలో దృశ్యాలను పరిశీలించగా పులి, ఎలుగుబంటి సంచిరిస్తున్నట్టుగా గుర్తించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించాయి. పులి, ఎలుగుబంటి ఉన్నట్లు నిర్ధారించిన తిరుపతి దేవస్థానం అధికారులు గుంపులుగా తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రికులు నడక మార్గంలో ప్రయాణించరాదని హెచ్చరిస్తున్నారు.

అలిపిరి నడక మార్గంలో నరశింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది భక్తులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. గత మూడు రోజులుగా వేకువ జామున, రాత్రి సమయాలలో చిరుతలు సంచరిస్తున్నట్టుగా గుర్తించారు. గతంలో దాడులు చేసిన ప్రాంతంలోనే రెండు చిరుతల సంచారాన్ని గుర్తించిన సిబ్బంది….భధ్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారిలో 24 న రాత్రి 8 గంటల సమయంలో చిరుత సంచారంపై కెమెరా ట్రాప్ లో గుర్తించారు. 10 రోజుల్లో రెండుసార్లు చిరుత సంచారం అందరిలో వణుకుపుట్టిస్తోంది. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తం ఉండాలంటున్న అటవీశాఖ అధికారులు.

ఇవి కూడా చదవండి

గత ఆగస్టులో అలిపిరి తీర్థయాత్ర మార్గంలో రాత్రిపూట ఆరేళ్ల బాలికను పులి చంపింది. ఈ ఘటన నేపథ్యంలో ముందుజాగ్రత్తగా ఫారెస్ట్‌ గార్డుతో పాటు గుంపులుగా మాత్రమే భక్తులను తిరుపతి నడక మార్గంలోకి అనుమతించారు. ఆరేళ్ల బాలికను పులి చంపిన తర్వాత తిరుపతిలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనుల్లో ఆరు పులులు, ఎలుగుబంటి చిక్కుకున్నాయి. యాత్రికులు హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో గుంపులుగా తప్ప పర్వతం ఎక్కవద్దని అధికారులు హెచ్చరించారు.