AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ పేరిట మైనర్ బాలిక కిడ్నాప్‌.. 3 నెలలుగా కానరాని ఆచూకీ..! హైకోర్టు సీరియస్

మూడు నెలల క్రితం.. ట్యూషన్ నుండి ఇంటికి వచ్చిన బాలిక బయటకు వెళ్లి వస్తానంటూ వెళ్లి ఇక తిరిగి రాలేదు. ఇన్ స్టాలో పరిచయం అయిన యువకుడితో వెళ్లిపోయినట్లు గుర్తించిన తలిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకూ బాలిక ఆచూకీ కనుగొనలేకపోయారు. దీంతో ఆ తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు గుంటూరు పట్టాభిపురం పోలీసులను తీవ్రంగా మందలించింది..

ప్రేమ పేరిట మైనర్ బాలిక కిడ్నాప్‌.. 3 నెలలుగా కానరాని ఆచూకీ..! హైకోర్టు సీరియస్
Guntur Missing Girl Case
T Nagaraju
| Edited By: |

Updated on: Sep 04, 2026 | 7:20 PM

Share

గుంటూరు, సెప్టెంబర్ 4: గుంటూరు నగరంలోని పట్టాభిపురం పిఎస్ పరిధిలో నివాసం ఉండే బాలిక ప్రవేటు స్కూల్లో పదో తరగతి చదువుతుంది. బాలికకు ఇన్ స్టా గ్రామ్ లో కొన్నాళ్లు క్రితం పర్చూరుకు చెందిన షేక్ జాన్ సైదా పరిచయం అయ్యాడు. ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్న బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ లో వేసుకున్నాడు. జూన్ 9వ తేదిన ట్యూషన్ నుండి ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు నిర్వహించే షాపు వద్దకు వెళ్లి వస్తానని అమ్మమ్మకు చెప్పి బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన బాలికను జాన్ సైదా బైక్ పై తీసుకెళ్లిపోయాడు. బాలిక తనతో పాటు బంగారు ఆభరణాలు, నగదు కూడా తీసుకెళ్లింది. ఇదేమీ తెలియని తల్లిదండ్రులు మొదట బాలిక కోసం వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పట్టాభిపురం పిఎస్ లో ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. సిసి కెమెరా విజువల్స్ సాయంతో జాన్ సైదా బైక్ పై వెళ్లినట్లు గుర్తించారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకూ బాలిక ఆచూకీ కనుగొనలేకపోయారు. మూడు నెలల గడుస్తున్న ఆచూకీ లేకపోవడంతో బాలిక తల్లిదండ్రులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలలు అవుతున్నా ఎందుకు ఆచూకీ కనిపెట్టాలేకపోయారంటూ ప్రశ్నించింది. దీంతో సిట్ ఏర్పాటు చేశామని చెప్పిన పోలీసులు సోమవారం నాటికి బాలికను తీసుకొస్తామని హై కోర్టు కు చెప్పారు. మిస్సింగ్ కేసును కిడ్నాప్ కేసుగా మార్చారు.

ఇవి కూడా చదవండి

అయితే బాలికను తీసుకెల్లిన జాన్ సైదా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకూ పది సిమ్ లను మార్చాడు. ఎక్కడా ఆన్ లైన్ పేమేంట్స్ చేయడం లేదు. బాలిక దగ్గరున్న నగదును ఉపయోగిస్తున్నట్లు భావిస్తున్నారు. గుంటూరు నుండి వెళ్లిన వీరిద్దరూ మొదట పర్చూరు వెళ్లి అక్కడ నుండి నెల్లూరు, కోయంబత్తూరు, పాలక్కాడ్ వెళ్లినట్లు తేల్చారు. అక్కడ నుండి సికింద్రాబాద్ కు మకాం మార్చినట్లు గుర్తించిన పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో వివిధ పేర్లతో ఖాతాలు తెరిచిన యువకుడు వాటి ద్వారా మెస్సేజ్ లు పంపుతున్నట్లు గుర్తించారు. కొద్దీ రోజుల క్రితం మీకు చేతనైతే పట్టుకోవాలంటూ ఇన్ స్టా ద్వారా జాన్ సైదా బాలిక తల్లిదండ్రులకు మెస్సెజ్ పంపించాడు. ఆ ఆధారంగా ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సోమవారం నాటికి వీరి అడ్రస్ కనుక్కొని బాలికను తీసుకొచ్చి కోర్టు ముందుంచాల్సిన నేపధ్యంలో ఏం జరుుగుతుందోన్న ఉత్కంఠ గుంటూరు నగరంలో నెలకొంది.

Follow Us
ప్రేమ పేరిట మైనర్ బాలిక కిడ్నాప్‌.. హైకోర్టు సీరియస్
ప్రేమ పేరిట మైనర్ బాలిక కిడ్నాప్‌.. హైకోర్టు సీరియస్
రాశి, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించిన హీరో ఎవరో తెల
రాశి, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్స్‌తో కలిసి నటించిన హీరో ఎవరో తెల
గంజాయి తరలిస్తున్న పోలీసులు చిక్కారు.. కట్‌చేస్తే మరో కేసులో ..
గంజాయి తరలిస్తున్న పోలీసులు చిక్కారు.. కట్‌చేస్తే మరో కేసులో ..
మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
ఆ సినిమాలో పాత్ర ఇవ్వలేదని.. కన్నీరు పెట్టుకున్న సావిత్రి..
ఆ సినిమాలో పాత్ర ఇవ్వలేదని.. కన్నీరు పెట్టుకున్న సావిత్రి..
సెకండ్ హ్యాండ్ కారు కొనేప్పుడు అసలు చెక్‌ చేయాల్సింది ఇవే!
సెకండ్ హ్యాండ్ కారు కొనేప్పుడు అసలు చెక్‌ చేయాల్సింది ఇవే!
నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి
నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి
9 రోజులకు నేపాల్ టన్నెల్ నుంచి బయటపడ్డ ఇద్దరు!
9 రోజులకు నేపాల్ టన్నెల్ నుంచి బయటపడ్డ ఇద్దరు!
విద్యార్థులకు అదిరిపోయే స్కాలర్‌షిప్‌లు.. ఏడాదికి రూ.1 లక్ష లాభం
విద్యార్థులకు అదిరిపోయే స్కాలర్‌షిప్‌లు.. ఏడాదికి రూ.1 లక్ష లాభం
పాకలో వేసే కీమా దోశ.. టేస్ట్ వేరే లెవల్ అంతే..
పాకలో వేసే కీమా దోశ.. టేస్ట్ వేరే లెవల్ అంతే..