AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBIలో 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలకు సంబంధించి జోనల్ హెడ్, రీజినల్ హెడ్, రిలేషన్‌షిప్ మేనేజర్, ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 4 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

SBIలో 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
SBI Specialist Cadre Officer Recruitment
Srilakshmi C
|

Updated on: Sep 04, 2026 | 3:35 PM

Share

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలకు సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (Specialist Cadre Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ కింద మొత్తం 222 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా సెప్టెంబరు 4, 2026 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • జోనల్ హెడ్ (రిటైల్) పోస్టుల సంఖ్య: 1
  • రీజినల్ హెడ్ (RH) పోస్టుల సంఖ్య: 5
  • రిలేషన్‌షిప్ మేనేజర్ – టీమ్ లీడ్ పోస్టుల సంఖ్య: 27
  • ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్ (IS) పోస్టుల సంఖ్య: 13
  • ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (IO) పోస్టుల సంఖ్య: 04
  • VC వెల్త్ పోస్టుల సంఖ్య: 95
  • AVC వెల్త్ పోస్టుల సంఖ్య: 77

పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, MBA, CA లేదా CFA వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి. విద్యార్హతతో పాటు సంబంధిత రంగంలో అవసరమైన ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. పోస్టుల వారీగా విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్‌ 25, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ / EWS / OBC అభ్యర్థులు రూ.750 చొప్పున తప్పనిసరిగా చెల్లించాలి. SC / ST / PwBD అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు రుసుము లేదు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. అంటే ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచి, వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: సెప్టెంబర్‌ 4, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 25, 2026.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us