AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: గంజాయి తరలిస్తున్న పోలీసులు చిక్కారు.. కట్‌చేస్తే మరో కేసులో అడ్డంగా బుక్కయ్యారు..

ఓ కేసులో పోలీసులు చిక్కారు.. కట్‌చేస్తే మరో కేసులో అడ్డంగా బుక్కయ్యారు.. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వెలుగు చూసింది. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులకు ఇద్దరు వ్యక్తులు చిక్కారు. అయితే వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు చేసిన మరో క్రైమ్ వెలుగులోకి వచ్చింది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Andhra News: గంజాయి తరలిస్తున్న పోలీసులు చిక్కారు.. కట్‌చేస్తే మరో కేసులో అడ్డంగా బుక్కయ్యారు..
Devarapalli Ganja Bust
B Ravi Kumar
| Edited By: |

Updated on: Sep 04, 2026 | 7:07 PM

Share

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. యెర్నగూడెం సమీపంలో ఎన్‌హెచ్-16 వద్ద అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన 21 కిలోల గంజాయితో పాటు రెండు బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

జాతీయ రహదారి పక్కనున్న పాత బ్రాందీ షాపు వద్ద మోటారు సైకిళ్లపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నట్లు దేవరపల్లి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్సై పి. మనోహర్ తన సిబ్బందితో కలిసి మధ్యవర్తుల సమక్షంలో అక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమ రవాణా గుట్టురట్టయింది. అరెస్టయిన వారిలో పెదపారుపూడి మండలం కొర్నిపాడుకు చెందిన మోచర్ల హేమంత్ కుమార్ అలియాస్ చిన్ను (20) , పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన చామనపూడి శరణ్ దాస్ అలియాస్ చరణ్ (28) లు ఉన్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఆగస్టు 31న యెర్నగూడెం పరిసరాల్లో హైవే మొబైల్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసి పరారైన దుండగులు వీరిద్దరేనని పోలీసులు గుర్తించారు. ఈ కేసుపై దేవరపల్లి సీఐ నాగేశ్వర నాయక్ నేతృత్వంలో దర్యాప్తు వేగవంతం చేశారు. పట్టుబడిన నిందితులను రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరు పరిచారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గంజాయి తరలిస్తున్న పోలీసులు చిక్కారు.. కట్‌చేస్తే మరో కేసులో ..
గంజాయి తరలిస్తున్న పోలీసులు చిక్కారు.. కట్‌చేస్తే మరో కేసులో ..
మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
ఆ సినిమాలో పాత్ర ఇవ్వలేదని.. కన్నీరు పెట్టుకున్న సావిత్రి..
ఆ సినిమాలో పాత్ర ఇవ్వలేదని.. కన్నీరు పెట్టుకున్న సావిత్రి..
సెకండ్ హ్యాండ్ కారు కొనేప్పుడు అసలు చెక్‌ చేయాల్సింది ఇవే!
సెకండ్ హ్యాండ్ కారు కొనేప్పుడు అసలు చెక్‌ చేయాల్సింది ఇవే!
నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి
నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి
9 రోజులకు నేపాల్ టన్నెల్ నుంచి బయటపడ్డ ఇద్దరు!
9 రోజులకు నేపాల్ టన్నెల్ నుంచి బయటపడ్డ ఇద్దరు!
విద్యార్థులకు అదిరిపోయే స్కాలర్‌షిప్‌లు.. ఏడాదికి రూ.1 లక్ష లాభం
విద్యార్థులకు అదిరిపోయే స్కాలర్‌షిప్‌లు.. ఏడాదికి రూ.1 లక్ష లాభం
పాకలో వేసే కీమా దోశ.. టేస్ట్ వేరే లెవల్ అంతే..
పాకలో వేసే కీమా దోశ.. టేస్ట్ వేరే లెవల్ అంతే..
ఏపీలో స్థానిక సమరానికి ముందడుగు.. 3 దశల్లో వార్డుల డీలిమిటేషన్
ఏపీలో స్థానిక సమరానికి ముందడుగు.. 3 దశల్లో వార్డుల డీలిమిటేషన్
ఓటిటి సెన్సేషన్ థియేటర్స్‌లో మ్యాజిక్ చేసిందా..?
ఓటిటి సెన్సేషన్ థియేటర్స్‌లో మ్యాజిక్ చేసిందా..?