AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యాక్షన్ రాజకీయాల్లో నాకూ బాధ్యత ఉంది.. గత తప్పులకు క్షమించండి: జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజలకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో జరిగిన తప్పులకు క్షమించాలని కోరుతూ, వాటి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ గొడవల కారణంగా ప్రజలకు జరిగిన నష్టాన్ని తలుచుకుంటే బాధ కలుగుతోందని పేర్కొన్నారు.

ఫ్యాక్షన్ రాజకీయాల్లో నాకూ బాధ్యత ఉంది.. గత తప్పులకు క్షమించండి: జేసీ ప్రభాకర్ రెడ్డి
Jc Prabhakar Reddy
Balaraju Goud
|

Updated on: Oct 21, 2026 | 5:52 PM

Share

అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజలకు జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గతంలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో జరిగిన తప్పులకు క్షమించాలని కోరుతూ, వాటి వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ గొడవల కారణంగా ప్రజలకు జరిగిన నష్టాన్ని తలుచుకుంటే బాధ కలుగుతోందని పేర్కొన్నారు.

ఎల్లనూరు ప్రజలు రాజకీయ విభేదాల కారణంగా గొడవల్లో చిక్కుకోవద్దని జేసీ సూచించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైసీపీ నాయకుడు భోగాతి నారాయణరెడ్డిని నమ్మవద్దని హెచ్చరించారు. రాజకీయాలు చేయాలనుకుంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల మద్దతు పొందాలని, అమాయక ప్రజలను రెచ్చగొట్టి గొడవల్లోకి లాగవద్దని హితవు పలికారు. రాజకీయాలు చదరంగం ఆట లాంటివని, నేరుగా వచ్చి తేల్చుకుందామని అన్నారు. తాను వైసీపీకి వ్యతిరేకం కాదని, కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారశైలినే వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. గతంలో తాను మంచివాడిని కాకపోయినా, ప్రస్తుతం ప్రాంత అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఫ్యాక్షన్ గొడవలతో ఇప్పటికే ఎంతోమంది నష్టపోయారని, ఇకనైనా ప్రజలు తమ పిల్లల చదువులు, కుటుంబ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. అవకాశం వస్తే నాలుగు చెరువులు నింపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎల్లనూరు మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొనాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us