Red Sandalwood: మళ్లీ మొదలైన ఎర్రచందనం స్మంగ్లింగ్.. ముగ్గురు అరెస్టు.. 20 ఎర్రచందనం దుంగల స్వాధీనం
Red Sandalwood: ఏపీలో మళ్లీ ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ మళ్లీ మొదలైంది. ఇప్పటికే పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం స్మంగ్లింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు చేపడుతున్నారు....
Red Sandalwood: ఏపీలో మళ్లీ ఎర్రచందనం దుంగల స్మగ్లింగ్ మళ్లీ మొదలైంది. ఇప్పటికే పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం స్మంగ్లింగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు చేపడుతున్నారు. ఇక తాజాగా కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ప్రోటక్షన్ వాచర్ శివాంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు స్మగ్లర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, తోట యజమాని సుధాకర్ రెడ్డిలను శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలు, కారు, రెండు సెల్‌ఫోన్లు, గొడ్డలి, రంపాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇందులో ప్రధాన స్మంగ్లర్ దాదాపు 12 సంవత్సరాలుగా ఎర్రచందనం దుంగల రవాణాకు పాల్పడుతున్నట్లు ఎస్పీ అన్బురాజన్ మీడియా ముందు వెల్లడించారు. అలాగే అడ్డువచ్చిన పోలీసులు, అటవీ శాఖ అధికారులపై దాడులకు పాల్పడేవాడని వెల్లడించారు. తమిళ కూలీలతో కలిసి ఎర్రచందనం దుంగలను నరికి కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పుల్లంపేట మండలం తిప్పాయపల్లె వద్ద పోలీసులు, అటవీ శాఖ అధికారులపై హత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. అయితే పరారైన మరి కొందరిని పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
కాగా, గత కొన్ని రోజుల నుంచి కడప, చిత్తూరు, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గిపోయింది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎర్రచందనం అక్రమ రవాణా జరుగకుండా ప్రత్యేక నిఘా పెట్టి చర్యలు చేపట్టారు. అడవుల్లో గాలిస్తూ తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను ఎందరినో అరెస్టు చేశారు. అయితే పోలీసులు, అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యల వల్ల గత కొన్ని రోజులు ఎర్రచందనం అక్రమ రవాణా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ మొదలు కావడంతో పోలీసులు రంగంలోకి దిగి అక్రమ రవాణాను అరికడుతున్నారు. గతంలో కూడా శేషాచలం అడవుల్లో ప్రతి రోజు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలు సంచరించేవారు. ఎర్ర దుంగలను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లల్లో సొమ్ము చేసుకునేవారు. ఏపీకి చెందిన కొందరు స్మగ్లర్లు తమిళ కూలీలతో జతకట్టి అక్రమ రవాణాకు పాల్పడేవారు. గతంలో అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను సైతం పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు నెట్టారు. పోలీసులు, అటవీ శాఖ అధికారుల చర్యలతో సైలెంట్‌గా ఉన్న అడవుల్లో.. మళ్లీ అలజడి రేపుతున్నారు స్మగ్లర్లు. అయితే ఎర్రచందనం స్మంగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: Court Judgement: కన్న కూతురుపైనే తండ్రి అత్యాచారం.. కామంధుడికి జీవిత ఖైదు విధించిన ప్రత్యేక న్యాయస్థానం
Road Accident: త్రిపురలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు బీజేపీ నాయకులు మృతి.. మరికొంత మందికి..