AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ‘పుష్ప’ సినిమా సీన్.. పుష్పరాజ్‌ను మించి స్కెచ్.. పోలీసులకే మైండ్ బ్లాక్..

'పుష్ప' సినిమాలోలా ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు..కానీ అందరూ పుష్పరాజ్‌లా తప్పించుకోలేరుగా..!  అందుకే పోలీసులకు అడ్డంగా పట్టుబడ్డారు. పుష్ప సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే ఏంటి.. దానికి ఎందుకు అంత విలువ అనే విషయాలు కొంచెం జనాలకు అవగాహనలోకి వచ్చాయి. దీంతో తక్కువ టైమ్‌లో డబ్బులు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు.

Andhra News: 'పుష్ప' సినిమా సీన్.. పుష్పరాజ్‌ను మించి స్కెచ్.. పోలీసులకే మైండ్ బ్లాక్..
Sandalwood Smugling
Noor Mohammed Shaik
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Dec 19, 2024 | 8:51 AM

Share

‘పుష్ప’ సినిమా చూశారా? అందులో కథ అంతా ఎర్ర చందనం చుట్టే తిరుగుతుంటుంది. అంతకు ముందు సంగతి ఏమో గానీ, ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే ఏంటి.. దానికి ఎందుకు అంత విలువ అనే విషయాలు కొంచెం జనాలకు అవగాహనలోకి వచ్చాయి. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడిన ఓ ముఠానే పోలీసులు పట్టుకున్న ఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది.

పెద్ద అంతర్ రాష్ట్ర అణిచివేతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ శుక్రవారం రూ. 2.5 కోట్ల విలువైన 4500 కిలోల కలపను స్వాధీనం చేసుకుంది. తిరుపతి జిల్లా నుంచి అక్రమంగా రవాణా చేయబడిన సుమారు రూ.5 కోట్ల విలువైన 4.5 టన్నుల బరువు ఉన్న దాదాపు 155 ఎర్రచందనం దుంగలను గుజరాత్‌లోని పటాన్‌ ప్రాంతంలో స్వాధీనం చేసుకుంది. వాటితో పాటు ఒక టయోటా బ్రెజ్జా కారును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన స్థానిక పోలీసుల సహకారంతో ఆర్‌ఎస్‌ఎఎస్‌టీఎఫ్ బృందం ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి తిరుపతికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ రెడ్ సాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ యూనిట్ డీఎస్పీ షరీఫ్ నేతృత్వంలో గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లా చేరుకుని అక్కడి స్థానిక పోలీస్ సిబ్బంది సహకారంతో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేయగా.. వారిని ఉత్తమ్ కుమార్ నందకిషోర్ సోనీ, జోషీ హన్స్ రాజ్, ఠాకూర్ పరేశ్‌జీగా గుర్తించారు. ముగ్గురు నిందితులు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారే.

నిందితులను ట్రాన్సిట్ వారెంట్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. వారెంట్ పొందిన తర్వాత స్వాధీనం చేసుకున్న సామగ్రి, నిందితులను తిరుపతికి తరలించి తదుపరి విచారణ చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల గుంటూరు జిల్లాలో కాగితపు కట్టల మధ్య దాచిన పెద్ద ఎర్రచందనం సరుకును పట్టుకున్న ఏపీ పోలీసులు రూ. 3.5 కోట్ల విలువైన 49 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. అక్రమంగా రవాణా చేయబడిన నిషేధిత వస్తువులు చైనాకు అక్రమ ఎగుమతి చేయబడినట్లుగా తెలిసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి