YS Jagan: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.! తెలంగాణ ఎఫెక్ట్‌తో వైసీపీ కీలక నిర్ణయం.. మార్పే మంత్రంగా..

వై నాట్‌ 175 అంటున్న వైసీపీ.. రాబోయే ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెట్టేసింది. గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు మార్పే మంత్రం అంటోంది. ఒక్క రోజే ఒక్కసారే 11 నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చేసింది. మార్పు మంచికే, రాబోయే ఎన్నికల్లో గెలుపుకే అంటోంది. ఈ మార్పు మంగళగిరి నియోజకవర్గం నుంచే మొదలైంది.

YS Jagan: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్.! తెలంగాణ ఎఫెక్ట్‌తో వైసీపీ కీలక నిర్ణయం.. మార్పే మంత్రంగా..
Ys Jagan
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 12, 2023 | 12:01 PM

వై నాట్‌ 175 అంటున్న వైసీపీ.. రాబోయే ఎన్నికలకు సన్నాహాలు మొదలు పెట్టేసింది. గెలుపు గుర్రాలను రంగంలోకి దించేందుకు మార్పే మంత్రం అంటోంది. ఒక్క రోజే ఒక్కసారే 11 నియోజకవర్గాల ఇన్‌చార్జిలను మార్చేసింది. మార్పు మంచికే, రాబోయే ఎన్నికల్లో గెలుపుకే అంటోంది. ఈ మార్పు మంగళగిరి నియోజకవర్గం నుంచే మొదలైంది. అయితే ఆ 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ఏకంగా 7 సీట్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. అసలు గుంటూరు జిల్లాలోనే ఇన్ని స్థానాల్లో ఇన్‌చార్జీల మార్పు వెనక ఉన్న మర్మం ఏంటి? ఆపరేషన్‌ గుంటూరు వెనుక ఉన్న అసలు స్ట్రాటజీ ఏంటి?

రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే మనం మారాలి. అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలను మార్చాలి. వై నాట్‌ 175 అనాలంటే.. మార్పు తప్పదు. మార్పు మంచికే, మళ్లీ గెలుపుకే అంటోంది ఏపీలో అధికార వైసీపీ. ఒకే రోజు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 11 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జీలను మార్చేసింది అధికార పార్టీ. అందులోనూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా ఏడుగురు ఇన్‌చార్జీలను మార్చింది. వైసీపీ మార్పు మంత్రం వెనుక అసలు మర్మం ఏంటి? ఉమ్మడి గుంటూరు జిల్లా పైనే స్పెషల్‌ ఫోకస్‌కి కారణాలేంటి? ఆపరేషన్‌ గుంటూరు స్ట్రాటజీలో అసలు సీక్రెట్‌ ఏంటి?

జనంలో ఉండాలి. జనంతో ఉండాలి. జనం నుంచి మార్కులు పడాలి. లేకుంటే అసెంబ్లీ ఇన్‌చార్జి పదవి ఊడిపోతుంది. జనం నుంచి మార్కులు పడ్డవాళ్లకు ఓకే. జనం నుంచి రిమార్కులు వస్తే ఇన్‌చార్జ్ మార్పు గ్యారంటీ. పొలిటికల్‌ సైన్స్‌ ప్రకారం…సర్వే ఫార్మూలాను అనుసరించి ముందుకు పోతోంది ఏపీలో అధికార వైసీపీ. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లకు జనం ఓకే అంటేనే సీటు. లేకపోతే వాళ్ల ఇన్‌చార్జి సీటు చిరిగిపోతోంది. దీనికితోడు పాత ముఖాలపై ఉన్నంత వ్యతిరేకత.. కొత్త ముఖాలపై ఉండదనే అంచనాలు కూడా ఉన్నాయి. దీనిలో భాగంగా ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏకంగా 7 అసెంబ్లీ స్థానాల్లో ఇన్‌చార్జీలను మార్చేసింది వైసీపీ. ఎవరిని మార్చారు.. అంటే కొండవీటి చాంతాడంత లిస్ట్‌ బయటకు వస్తోంది. ఎందుకు మార్చారు అంటే.. ప్రజా నాడితో పాటు పార్టీలో గ్రూపుల గోల, సామాజిక వర్గాల ఈక్వేషన్లు, కొత్త ముఖాలను దింపే వ్యూహం.. ఇలాంటి కూడికలు, తీసివేతలు జరిగాక ఉమ్మడి జిల్లాలో ఏడుగురు ఇన్‌చార్జీలకు స్థాన భ్రంశం జరిగింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు, చిలకలూరిపేట, గుంటూరు వెస్ట్‌, మంగళగిరి, రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్‌చార్జీల మార్పునకు శ్రీకారం చుట్టింది వైసీపీ. ఇందులో ప్రత్తిపాడు, తాడికొండ, వేమూరు.. ఈ మూడు ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీట్లు కావడం విశేషం. ప్రత్తిపాడులో వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరితను తప్పించి.. బాలసాని కిరణ్ కుమార్‌ అనే కొత్త ముఖాన్ని రంగంలోకి దింపింది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన కిరణ్‌ కుమార్‌.. విజయవాడలో వైసీపీ కార్పొరేటర్‌ తనయుడని చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం మూడు ఎస్సీ సీట్లలో రెండు మాలలకు, ఒకటి మాదిగ కులస్తులకు కేటాయించే ఆనవాయితీ ఉంది. ఈ ఫార్ములా ప్రకారం..ప్రత్తిపాడును మాదిగ వర్గానికి చెందిన కిరణ్‌కు ఇచ్చారు. ఇక ప్రత్తిపాడులో టీడీపీ ఈసారి మాదిగ సామాజిక వర్గానికి చెందిన రామాంజనేయులు అనే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిని బరిలో దించుతోంది. సో.. ఇక్కడ టీడీపీని దెబ్బ కొట్టడానికి అదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని దించింది వైసీపీ. ఇక మేకతోటి సుచరితను తాడికొండ ఇన్‌చార్జిగా నియమించారు. అక్కడ ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి.. టీడీపీలోకి ఫిరాయించడంతో అక్కడకు సుచరితను ఇన్‌చార్జిగా ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఇక మేకతోటి సుచరిత మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీనికితోడు ఆమె సొంత మండలం ఫిరంగిపురం.. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంది. దానికితోడు ప్రత్తిపాడులో గ్రూప్‌ రాజకీయాలు, కొంతమేర వ్యతిరేకత ఉండడంతో సుచరితకు స్థానభ్రంశం తప్పలేదు. ఇక తాడికొండలో టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్‌ కుమార్‌ కూడా మాల వర్గానికి చెందినవారే. దీంతో ఆయనను ఓడించాలంటే సుచరితే బెస్ట్‌ కేండిడేట్‌ అని పార్టీ అధిష్టానం భావించింది. ఆమె తాడికొండ వెళితే గ్రూపుల గోల కూడా ఉండదు. ఈ ఈక్వేషన్లన్నీ లెక్కలోకి తీసుకుని సుచరితను తాడికొండ పంపించింది హైకమాండ్‌.

ఇక వేమూరు అసెంబ్లీ సీటులో మంత్రి మేరుగ నాగార్జునను తప్పించి ఆయన ప్లేసులో వరికూటి అశోక్‌బాబును నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది వైసీపీ. ఇక్కడ మేరుగపై వ్యతిరేకత ఉండడంతో ఆయనను ప్రకాశం జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేశారని చెబుతున్నారు. ఆయన స్థానికుడు కాకపోయినా మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి…నియోజకవర్గంలో కొత్త ముఖం కావడంతో కలిసి వస్తుందని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ఇక చిలకలూరిపేటలో మంత్రి విడదల రజనీని తప్పించి…మల్లెల రాజేష్‌ నాయుడ్ని ఇన్‌చార్జిగా రంగంలో దింపింది వైసీపీ. ఇక్కడ కమ్మ కులానికి ఇస్తే వర్కౌట్‌ అవదని లెక్కలు వేసుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన రాజేష్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది అధికార పార్టీ. ఇక్కడ వైసీపీ నేతలు మర్రి రాజశేఖర్‌, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలతో పొసగకపోవడం వల్లే రజనీకి స్థానభ్రంశం కలిగిందంటున్నారు. దీనికితోడు ఇక్కడ కాపుల ఓట్లు 25 వేల వరకు ఉన్నాయి. దీంతో మల్లెల రాజేష్‌కి ఇన్‌చార్జి పదవి ఇచ్చారంటున్నారు. చిలకలూరిపేట నుంచి తప్పించిన విడదల రజనీకి…గుంటూరు వెస్ట్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అక్కడ కాపుల ఓట్లు, బీసీల ఓట్లు గణనీయమైన సంఖ్యలో ఉంటాయి. విడదల రజనీ భర్త కుమార స్వామి కాపు కులానికి చెందిన వ్యక్తి. ఇక ఇక్కడ ఎస్సీల ఓట్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. ఈ వర్గాల ఓట్లు రజనీని గట్టెక్కిస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. ఇక్కడ టీడీపీలో గెలిచి వైసీపీతో సన్నిహితంగా ఉన్న మద్దాల గిరి వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదు. ఇక్కడ స్థానిక వైసీపీ లీడర్‌ లేళ్ల అప్పిరెడ్డి బలమైన నేత. ఆయన అండ కూడా ఉంటుంది కాబట్టి.. విజయం నల్లేరు మీద నడక అని భావించి రజనీకి ఇక్కడి ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు.

ఇక మంగళగిరి ఇన్‌చార్జి మార్పు…ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే…తన పదవికి పార్టీకి కూడా రాజీనామా చేయడం…అధిష్టానం గంజి చిరంజీవిని మంగళగిరి నియోజకవర్గం ఇన్‌చార్జీగా నియమించడం చకచకా జరిగిపోయింది. చిరంజీవి పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మంగళగిరి టౌన్‌లో ఆ సామాజిక వర్గం ఓట్లు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున లోకేష్‌ బరిలోకి దిగితే…అతడ్ని ఎదుర్కోవడానికి తన సాంప్రదాయ ఓటుబ్యాంకుకు పద్మశాలి ఓటుబ్యాంక్‌ తోడవుతుందని వైసీపీ లెక్కలు వేసుకుంది. ఇక గత ఎన్నికల్లో రేపల్లె అసెంబ్లీ సీటులో వైసీపీ ఓడిపోయింది. అక్కడ్నించి టీడీపీ తరఫున అనగాని సత్యప్రసాద్‌ గెలిచారు. ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఈవూరు గణేష్‌ను రేపల్లె ఇన్‌చార్జిగా రంగంలోకి దించింది వైసీపీ. గణేష్‌ తల్లి ఈవూరు సీతారావమ్మ ఇదే నియోజకవర్గం నుంచి గతంలో రెండుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. గణేష్‌ను రంగంలోకి దించడం వల్ల…గౌడ్స్‌ ఓట్లతో పాటు…స్థానికంగా వైసీపీకి పెద్దదిక్కుగా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకట రమణారావుకు చెందిన మత్స్యకార వర్గ ఓట్లు కూడా పడతాయని వైసీపీ భావిస్తోంది. ఇలా రెండు బలమైన బీసీ వర్గాల ఓట్లతో పాటు ఎస్సీల ఓట్లు తమ విజయానికి బాటలు వేస్తాయని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. ప్రజా నాడిని బట్టే ఇన్‌చార్జీల మార్పు జరిగిందంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. కాగా, ఇన్‌చార్జీల మార్పుపై తెలంగాణ ఫలితాల ప్రభావం కూడా ఉందని చెబుతున్నారు. మార్పు మంత్రంతోనే మళ్లీ గెలిచేందుకు వైసీపీ వ్యూహం సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. దానిలో భాగంగానే ఆపరేషన్‌ గుంటూరు పేరుతో భారీ ప్రక్షాళన చేపట్టింది.

హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్