Gudivada: రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కాలని ఇద్దరు యువకుల పందెం.. ఆ ప్రయత్నం చేస్తుండగా..

కృష్ణా జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పందెం ప్రాణాల మీదకు తెచ్చింది. గూడ్స్ రైలు ఎక్కేందుకు యత్నించి కిందపడ్డాడు విద్యార్థి. గుడివాడ రైల్వే స్టేషన్‌లో ఘటన జరిగింది.

Gudivada: రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కాలని ఇద్దరు యువకుల పందెం.. ఆ ప్రయత్నం చేస్తుండగా..
Gudivada Railway Junction
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 03, 2023 | 8:31 PM

స్నేహితులతో సరదాగా వేసుకున్న పందెంలో ఓ విద్యార్ధి కాలు పోగొట్టుకున్నాడు. కదులుతున్న ట్రైన్‌ ఎక్కాలని ఇంటర్మీడియట్‌ విద్యార్దులు పందెం కాసుకున్నారు. పందానికి సై అంటే సై అనుకున్నారు. ఇంకేముంది రన్నింగ్‌లో ఉన్న ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయత్నించి కిందపడ్డాడు ఓ స్టూడెంట్. సరదా కోసం చేసిన స్టంట్‌ కాలు పోయేలా చేసింది. గుడివాడ రైల్వేస్టేషన్ దగ్గర ఈ ఘటన జరిగింది.

చూడండి.. ఎంత ఘోరం జరిగిందో.. అందుకే ఏదైనా పని చేసేముందుకు కాసేపు ఆలోచించండి. ఒకవేళ పందెంలో గెలిస్తే ఏమొస్తుంది. కిరీటాలు పెట్టి.. ఊరంతా ఊరేగిస్తారా..? లేక గోల్డ్ మెడల్ ఏమైనా ఇస్తారా..? కానీ ఇప్పుడు కాలు పోయింది. అదే టైమ్ ఇంకా బాగలేకపోతే ప్రాణమే పోయేది. ఇప్పుడు ఆ కాలు అతికించడం కుదురుతుందో, లేదో డాక్టర్లు చెప్పాలి. లేదంటే జీవితమంతా వైకల్యాన్ని అనుభవించాల్సిందే. యువతా.. బీ అలెర్ట్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..