Telangana: తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు.. ఎన్నికలు ఎప్పుడో చెప్పిన బీజేపీ సీనియర్ నేత..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఏపీ బీజేపీ లీడర్ టీజీ వెంకటేష్. టీవీ9తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన టీజీ... తెలంగాణలో ప్రకంపనలు పుట్టించే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఇంతకీ, టీజీ వదిలిన ఆ పొలిటికల్ బాంబ్ ఏంటి?. తెలంగాణ రాజకీయాలను అది కుదిపేయనుందా?. ఇంతకీ, టీజీ ఏమన్నారు!.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత టీజీ వెంకటేష్, ఒకే ఒక్క మాటతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించారు. కలలో కూడా ఎవ్వరూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగకపోవచ్చంటూ సెన్షేషనల్ స్టేట్‌మెంట్ వదిలారు. ఏదో ఆషామాషీగా ఈ కామెంట్స్ చేయలేదు ఆయన. చాలా లాజికల్‌గా మాట్లాడారు. కేసీఆర్ తన బెనిఫిట్ కోసం ఆరోజు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలని ఏముంది?. ఈసారి ఏదైనా జరగొచ్చు!. జనరల్ ఎలక్షన్స్‌తోపాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు జరగకూడదంటూ బాంబ్ పేల్చారు టీజీ.
ఇది, టీజీ లెక్క. ఒకవేళ జనరల్ ఎలక్షన్స్‌తోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఐదారు నెలలు రాష్ట్రపతి పాలన తప్పదన్నది ఆయన లాజిక్. ఇక, ఏపీలోనూ ప్రెసిడెంట్ రూల్ ఉంటే ఉండొచ్చంటూ చెప్పుకొచ్చారు టీజీ. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దుచేసే సాహసం జగన్ చేయకపోవచ్చన్నారు. పవన్‌కల్యాణ్ అండ్ బాబుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు టీజీ వెంకటేష్. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరంటూ కాకపుట్టించే కామెంట్స్ చేశారు
టీజీ వెంకటేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణలో కాకరేపుతున్నాయ్. జనరల్ ఎలక్షన్స్‌తోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చన్న వ్యాఖ్యల వెనుక బీజేపీ వ్యూహం ఉందా? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగి, ప్రెసిడెంట్ రూల్ వస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం!.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం