TSPSC: మొన్న సెక్రటరీ.. ఇవాళ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి.. స్టేట్‌మెంట్స్ రికార్డుతో సిట్ దూకుడు..
టీఎస్‌పీఎస్‌సీ లీకేజీ ఎపిసోడ్‌లో రోజుకో షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ చైన్ లింక్‌ను ఛేదిస్తోంది సిట్. ఇన్నాళ్లూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ మొత్తం ఇప్పుడు పెద్ద తలకాయలను ప్రశ్నించే వరకూ వెళ్లింది. లేటెస్ట్‌గా TSPSC ఛైర్మన్ స్టేట్‌మెంట్ రికార్డు చేసింది సిట్. మరి, ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డి ఏం చెప్పారు?. సిట్ నెక్ట్స్ ఏం చేయబోతోంది?
మొన్నటివరకూ ఒకలెక్క-ఇకపై మరో లెక్క అన్నట్టుగా సాగుతోంది సిట్ ఎంక్వైరీ. టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ విచారణ తర్వాత మొత్తం సీనే మారిపోయింది. ప్రశ్నపత్రాలు, ఆన్సర్ షీట్స్ …కమిషన్ ఛైర్మన్ ఆధీనంలోనే ఉంటాయని, ఆయన కంప్యూటర్‌లో మాత్రమే నిక్షిప్తం అవుతాయని, బోర్డు సభ్యుల ప్రమేయం ఉండదంటూ అనితా రామచంద్రన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో సిట్ ఇన్వెస్టిగేషన్ కీలక మలుపు తిరిగింది. అవసరమైతే టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్‌ను కూడా విచారిస్తామన్న సిట్, చేసి చూపించింది. రెండుగంటలపాటు ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డిని ప్రశ్నించి స్టే్‌ట్‌మెంట్ రికార్డు చేసింది. ప్రశ్నపత్రం తయారీ నుంచి వాటిని భద్రపర్చడం, ఎగ్జామ్స్ నిర్వహణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌లో మీ పాత్ర ఏంటంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఉద్యోగులు టీఎస్‌పీఎస్‌సీ ఎగ్జామ్స్ రాయాలంటే కండీషన్స్ ఏంటి?. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నిర్వహణ ఏవిధంగా చేస్తారు? అంటూ ఛైర్మన్ నుంచి డిటైల్స్ తీసుకున్నారు సిట్ అధికారులు.
ఇప్పటివరకూ ఉద్యోగుల చుట్టూ తిరిగిన కథ ఇప్పుడు పెద్ద తలకాయల వైపు మళ్లింది. తీగలాగేకొద్దీ ఇంటి దొంగలు ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. అయితే, టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ జనార్ధన్‌రెడ్డిని, సెక్రటరీ అనితా రామచంద్రన్‌ను, టీఎస్‌పీఎస్‌సీ లింగారెడ్డిని ప్రశ్నించడం మాత్రం పెద్ద విషయంగానే చెప్పుకోవాలి. ప్రధాన నిందితుడు ప్రవీణ్… అనితా రామచంద్రన్‌కు పీఏ కావడం, మరో నిందితుడు రమేష్… లింగారెడ్డికి పీఏగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.
సిట్ ఇన్వెస్టిగేషన్‌లో రోజుకో షాకింగ్ ఇన్ఫర్మేషన్ బయటికొస్తోంది. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్‌దే కీలక పాత్రగా తేలింది. మూడు ఏఈ పేపర్లను 40లక్షలకు అమ్ముకున్నాడు రాజేశ్వర్. అడ్వాన్స్‌గా 25లక్షలు తీసుకుని, అందులో 10లక్షలు డాక్యానాయక్‌కు ఇచ్చాడు. ఆ 10లక్షల్లో ఐదు లక్షల రూపాయలు A1 ప్రవీణ్‌కి ఇచ్చాడు డాక్యా.
ఇక, పేపర్లు అమ్మిన డబ్బుతో సొంతూరులో చిట్టీల వ్యాపారం చేసిన రాజేశ్వర్, గ్రామంలో అభివృద్ధి పనులు కూడా చేసినట్టు గుర్తించారు అధికారులు. ఇలా, ఒక్కో ముడిని విప్పుకుంటూ చైన్ లింక్‌ను ఛేదిస్తోంది సిట్. మరి, ఛైర్మన్ స్టేట్‌మెంట్‌తో కేసు కొలిక్కి వస్తుందా? లేక సీరియస్‌లా సాగుతుందా?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం