AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakasam: రాధను చంపింది అతడేనా..? మంచి చేయడమే ఆమె చేసిన పాపమా..?

చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్.. డబ్బు అవసరమని అడిగితే భర్తతో మాట్లాడి ఇప్పించింది. స్నేహితుడికి ఆర్థికంగా ఆసరా ఇస్తున్నట్లు ఆమె అనుకుంది. కానీ డబ్బు ఏ మనిషిని ఎప్పుడు ఎలా మారుస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇక్కడా అదే జరిగిందా..?

Prakasam: రాధను చంపింది అతడేనా..? మంచి చేయడమే ఆమె చేసిన పాపమా..?
Radha
Ram Naramaneni
|

Updated on: May 19, 2023 | 3:55 PM

Share

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో వివాహిత మరణం కలకలం రేపుతుంది. జిల్లెళ్లపాడుకు చెందిన రాధ అనే మహిళ మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమె మృతికి స్నేహితుడే హంతకుడిగా భావిస్తున్నారు పోలీసులు. నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.  వెలిగండ్ల మండలం గుండ్లోపల్లి గ్రామానికి చెందిన కాశిరెడ్డి.. బెంగుళూరులో సాప్ట్‌వేర్ కంపెనీ రన్‌ చేస్తున్నాడు. హైస్కూల్ కాస్ మేట్ కావడంతో కాశిరెడ్డికి.. తన భర్తతో 80లక్షలు రూపాయలు వడ్డీకి ఇప్పించింది రాధ. తీసుకున్న డబ్బులో కొంత తిరిగిచ్చేస్తా తాను చెప్పిన చోటికి వెళ్తే తనవాళ్లు డబ్బులిస్తారు అని రాధాకు మెసేజ్ చేశాడు కాశిరెడ్డి. దీంతో నిజమేనని నమ్మిన రాధ బిడ్డను వెంటబెట్టుకుని కనిగిరి వెళ్లారు. చిన్నాన్న ఇంటిలో పిల్లాడిని వదిలి.. పామూరు బస్టాండ్‌ వద్దకు చేరారు. షాపింగ్ చేశారు. కాసేపటి తర్వాత కుటుంబ సభ్యులు ఫోన్‌ చేస్తే.. ఇదిగో వచ్చేస్తున్నా అని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆమె తల్లిదండ్రులు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా రాధ జిల్లెళ్లపాడు సమీపంలోనే ఉందని పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి చూడగా ఆమె విగత జీవిగా ఉంది.

హత్య చేసి యాక్సిండెట్ గా క్రియేట్ చేశారని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. ఇదే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడుకు చెందిన రాధకు నల్గొండ జిల్లా కోదాడకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి కోట మోహన్ రెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. భర్తతో కలిసి రాధ హైదరాబాద్ లో నివాసముంటుంది. కొన్నిరోజుల క్రితం గ్రామంలో జరిగే చౌడేశ్వరి ఉత్సవాలకు పుట్టినిల్లుకు వచ్చింది రాధ.

ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఏం జరిగింది.? రాధను ఎవరు హత్య చేశారనేది మిస్టరీగా మారింది. కేతిరెడ్డి కాశిరెడ్డి పాత్రపై ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. రాధను అత్యంత క్రూరంగా, పాశవికంగా హత్య చేశారనేది ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. నిందితుడు కాశిరెడ్డి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే