Andhra Pradesh: రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ.. సమావేశం కార్యక్రమంలో రచ్చ రచ్చ
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు గొడవకు దిగారు. కొత్త ఇన్‌చార్జ్ పరిచయ కార్యక్రమంలో పాత ఇన్‌చార్జ్‌కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేయడంతో రచ్చ రాజుకుంది.
చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు భగ్గుమంది. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు గొడవకు దిగారు. కొత్త ఇన్‌చార్జ్ పరిచయ కార్యక్రమంలో పాత ఇన్‌చార్జ్‌కు వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేయడంతో రచ్చ రాజుకుంది. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా సొంత జిల్లాపై ఫోకస్ పెట్టిన ఆయన.. పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తున్నారు. దానిలో భాగంగానే గంగాధర నెల్లూరు బాధ్యతల్ని థామస్‌కు అప్పగించారు చంద్రబాబు. దీంతో.. ఎస్‌ఆర్‌పురంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో కొత్త ఇన్‌చార్జ్ థామస్ పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
అయితే ఈ సమావేశానికి హాజరైన కొద్దిసేపటికే గందరగోళం మొదలైంది. ఇప్పటిదాకా ఇన్‌చార్జ్‌గా ఉన్న చిట్టిబాబును సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ ఆరు మండలాల టీడీపీ అధ్యక్షులు డిమాండ్ చేయడంతో పరిచయ కార్యక్రమం కాస్త రచ్చగా మారింది. రెండు వర్గాలుగా విడిపోయిన టీడీపీ శ్రేణులు.. మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి ముందే గొడవకు దిగారు. రెండు వర్గాలు కుర్చీలను గాల్లోకి విసిరేసి నిరసన వ్యక్తం చేశాయి. కొత్త ఇన్‌చార్జ్ థామస్‌కు అనుకూలంగా టీడీపీలోని వర్గం నినాదాలు చేసింది.
ఈ సమావేశంలో కొందరు టీడీపీ కార్యకర్తల తీరుతో అమర్నాథ్‌రెడ్డి ఒక్కసారిగా షాకయ్యారు. ఎంత చెప్పినా వినకుండా నినాదాలు చేస్తుండటంతో.. టీడీపీ శ్రేణులకు చేతులెత్తి మొక్కి.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు అమర్నాథ్‌రెడ్డి. ఎక్కడా వర్గాలు క్రియేట్ చేయొద్దని.. తెలుగుదేశం పార్టీకి నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని స్పష్టం చేశారు. ఒకవైపు టీడీపీని సెట్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. ఇంకోవైపు పార్టీ శ్రేణుల్లో వర్గపోరు జరుగుతోంది. ఈ పరిణామాలు అధినేతకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..