Yadlapati Venkatarao: టీడీపీ సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత.. చంద్రబాబు సహా పలువురు సంతాపం..
Yadlapati Venkatarao passes away: టీడీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు (104) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో
Yadlapati Venkatarao passes away: టీడీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు (104) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న యడ్లపాటి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. యడ్లపాటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అంతేకాకుండా రైతు నాయకుడిగా, సంగం డైయిరీకి మొదటి అధ్యక్షుడిగా వెంకట్రావు విశేష సేవలందించారు. తెనాలి (Tenali) సమీపంలోని బోడపాడులో 1919 లో జన్మించిన యడప్లాటి వెంకట్రావు.. 1967,1978లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978-80 మధ్య వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. అనంతరం 1983లో టీడీపీలో చేరారు. 1995లో గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్గా, 1998లో రాజ్యసభ్యుడిగా యడ్లపాటి వెంకట్రావు ఎన్నికై సేవలందించారు. టీడీపీ సీనియర్ నేత మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.
కాగా.. మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతి పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా సాగిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. యడ్లపాటి జీవితం ప్రతీతరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యడ్లపాటి కుంటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేశారు. ఆయనతోపాటు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, ఆనందరావు, ప్రత్తిపాటి తదితర నాయకులు సంతాపం తెలిపారు.
Also Read: