AP Crime News: ఎమ్మెల్యే పీఏ అంటూ.. షాపు యజమానులకు కుచ్చుటోపి.. మంగళగిరిలో నయామోసం..

Guntur District Crime News: ఏపీలోని గుంటూరు జిల్లాలో నయామోసం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పీఏ అంటూ ఓ వ్యక్తి పలు దుకాణాదాలకు కుచ్చుటోపి పెట్టాడు.

AP Crime News: ఎమ్మెల్యే పీఏ అంటూ.. షాపు యజమానులకు కుచ్చుటోపి.. మంగళగిరిలో నయామోసం..
Mla Pa
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 28, 2022 | 9:15 AM

Guntur District Crime News: ఏపీలోని గుంటూరు జిల్లాలో నయామోసం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పీఏ అంటూ ఓ వ్యక్తి పలు దుకాణాదాలకు కుచ్చుటోపి పెట్టాడు. మంగళగిరి (Mangalagiri) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సమీపంలోని రెండు కిరాణా షాపుల నుంచి ఎమ్మెల్యే పీఏ అంటూ సుమారు 20 వేల రూపాయల మేరకు వ్యక్తి మోసం చేశాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్తకులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేవస్థానం సమీపంలోని ఓ కిరాణా దుకాణం వద్దకు తన పేరు మురళి అని.. నేను ఎమ్మెల్యే పీఏ నని చెప్పి సరుకుల లిస్ట్ ఇచ్చి, మీ షాపు కుర్రాడితో నేను చెప్పిన అడ్రస్‌కి పంపమని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతను షాపు యజమానులుకి ఫోన్ చేసి మంగళగిరి బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న విజే కాలేజీ రోడ్డులో గల కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తికి సరుకుల సంచి ఇవ్వమని, నేను టీడీపీ కార్యాలయంలో మీటింగులో ఉన్నానని ఆఫీస్ గేటు దగ్గరకు వస్తే డబ్బులు ఇచ్చి పంపిస్తానని చెప్పాడు. మురళి అనే వ్యక్తి చెప్పిన ప్రకారమే షాప్‌లో పనిచేసే కుర్రాడు సరుకుల సంచిని అతను చెప్పిన కొబ్బరి బొండాల వ్యాపారి అందజేసి టీడీపీ ఆఫీస్‌కి వెళ్ళాడు.

ఎంతకీ అతను రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్‌లో ఉందని తెలిపారు. అనుమానం వచ్చి ఆ షాపు కుర్రాడు తిరిగి కొబ్బరి బొండాల వ్యాపారి వద్దకు వచ్చి అడగగా.. ఎవరో వ్యక్తి వచ్చి సరుకు సంచి నేనే ఇక్కడ పెట్టమని చెప్పానని.. అంటూ తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పటంతో మోసపోయానని గ్రహించి వెనుదిరిగాడు.

వెంటనే షాపు యజమానులు గ్రహించి మోసం చేసి వ్యక్తికి సంబంధించిన ఫోన్ నెంబరు (9494323553), సీసీటీవీ ఫుటేజీలను ఫోటోలను మంగళగిరిలోని ఇతర వర్తక వ్యాపారులకు పంపి మిగతా వారందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఘటనపై షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టి నాగరాజు, టీవీ9 తెలుగు రిపోర్టర్, గుంటూరు

Also Read:

Viral Video: వేదికపైనే పొట్టు పొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. కారణం తెలిస్తే ఫ్యూజులు ఔట్..!

Ice Wall Climbing: లడఖ్‌లో తొలిసారిగా ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలు.. భారీగా పాల్గొన్న పర్వతారోహకులు