Andhra Pradesh: లగేజీ బ్యాగులు అనుకున్నారు.. ఓపెన్ చేసి ఖంగుతిన్న పోలీసులు.. బ్యాగులు స్వాధీనం.. వీడియో
కర్నూలు జిల్లా పంచలింగాల అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో బ్యాగులు కనిపించాయి. మొదట వాటిని ఏవో లగేజ్ బ్యాగులు అయి ఉంటాయిలే అనుకున్నారు.
కర్నూలు జిల్లా పంచలింగాల అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో బ్యాగులు కనిపించాయి. మొదట వాటిని ఏవో లగేజ్ బ్యాగులు అయి ఉంటాయిలే అనుకున్నారు. మళ్లీ అనుమానం వచ్చి.. ఓపెన్ చేసి చూసి షాక్ తిన్నారు పోలీసులు. ఆ బ్యాగుల నిండా వెండి ఆభరణాలే.. అవి ఎక్కడవని ఆరా తీస్తే పొంతన లేని సమాధానాలు చెప్పారు వాటిని తరలిస్తున్న వ్యక్తులు. దాంతో కారుతో సహా పది బ్యాగులలో ఉన్న వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 167 కేజీల వెండి ఆభరణాలు అనధికారికంగా తరలిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. పట్టుబడిన వెండి ఆభరణాల విలువ కోటి 20 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. బెంగళూరుకు చెందిన అభిషేకం వీటిని తరలిస్తున్నాడని, అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ మంజుల వెల్లడించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

