Shark Fish Attack: రెప్పపాటులో అంత అయిపోయింది..! స్విమ్మర్‌పై షార్క్ చేప ఎటాక్.. షాకింగ్ వీడియో..
బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తున్న ఓ వ్యక్తిపై షార్క్ చేప దాడి చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఈ దారుణ ఘటనలో స్విమ్మర్ మృతి చెందాడు. ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగింది. కాగా మృతుని వివరాలు తెలియరాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. సిడ్నీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న
బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తున్న ఓ వ్యక్తిపై షార్క్ చేప దాడి చేసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఈ దారుణ ఘటనలో స్విమ్మర్ మృతి చెందాడు. ఫిబ్రవరి 16న ఈ ఘటన జరిగింది. కాగా మృతుని వివరాలు తెలియరాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. సిడ్నీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లిటిల్ బే బీచ్’ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో సిడ్నీలోని పలు బీచ్ లను మూసివేశారు. 1963 తర్వాత ఒక షార్క్ చేప దాడిలో వ్యక్తి మరణించడం ఇదే మొదటిసారి అని అక్కడి అధికారులు తెలిపారు. షార్క్ చేపను పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దాడి జరిగిన బీచ్ ప్రాంతంలో డ్రమ్ లైన్లను ఏర్పాటు చేయడంతోపాటు షార్క్ చేప ఎక్కడ ఉన్నదీ గుర్తించేందుకు డ్రోన్లను రంగంలోకి దింపారు. తెల్లటి రంగులో, 9.8 అడుగుల పొడవుతో ఉన్న షార్క్ ఆ వ్యక్తిపై దాడి చేసినట్టు న్యూ సౌత్ వేల్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రైమరీ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి తెలిపారు. దాడి జరిగిన బీచ్ కు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

