Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Arrest: టీడీపీ శ్రేణుల ‘సత్యమేవ జయతే’.. జైలులో కొనసాగుతోన్న చంద్రబాబు దీక్ష..

Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా సత్యమేవ జయతే పేరిట.. టీడీపీ నేతలు ఒక్కరోజు నిరాహార దీక్షలను చేపట్టారు.

Chandrababu Arrest: టీడీపీ శ్రేణుల ‘సత్యమేవ జయతే’.. జైలులో కొనసాగుతోన్న చంద్రబాబు దీక్ష..
Satyameva Jayate Deeksha
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 02, 2023 | 1:38 PM

Chandrababu Naidu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా సత్యమేవ జయతే పేరిట.. టీడీపీ నేతలు ఒక్కరోజు నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్ష సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. అయితే, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు.. ఉదయం పది గంటల నుంచి సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. చంద్రబాబు నిరాహార దీక్షలో ఉన్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని జైలు అధికారులు, వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బీపీ, పల్స్‌ను జైలు అధికారులు తనిఖీ చేస్తున్నారు.

రాజమండ్రిలో భువనేశ్వరి..

కాగా.. రాజమండ్రిలోని క్వారీ సెంటర్‌ వద్ద చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిరసన దీక్ష చేస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు.

ఢిల్లీలో లోకేష్..

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఢిల్లీలో ఎంపీ కనకమేడల నివాసంలో దీక్ష చేస్తున్నారు. కనకమేడల రవీంద్రకుమార్‌ ఇంట్లో నారా లోకేష్ తోపాటు ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, రఘురామకృష్ణ రాజు తదితరులు నిరసన దీక్ష చేపట్టారు.

మంగళగిరిలో..

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ సత్యమేవ జయతే దీక్ష కొనసాగుతోంది. మహాత్మాగాంధీ చిత్రపటానికి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీక్షను ప్రారంభించారు.

హైదరాబాద్‌లో..

చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎన్టీఆర్‌ కుమార్తె గారపాటి లోకేశ్వరి, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర తదితర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు మద్దతుగా బుద్దా వెంకన్న కుటుంబ సభ్యుల నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. బుద్దా వెంకన్న కుమార్తె బుద్దా ప్రత్యూష దీక్ష చేపట్టారు. చంద్రబాబు రాష్ట్రం కోసమే ఆలోచించేవారని.. కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చినందుకు చంద్రబాబును ఇలా చేశారా..? అంటూ ఆమె ప్రశ్నించారు.

కాగా.. సత్యమేవ జయతే దీక్ష అనంతరం సాయంత్రం 7 గంటలకు ప్రతి ఇంట్లో లైట్లన్నీ ఆపేసి.. ఇంటి ముందు కొవ్వొత్తులతో నిరసన తెలపాలని టీడీపీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..