TDP – Mahanadu: ‘మహానాడు’ వేదికగా వైసీపీపై యుద్ధం.. బుల్లెట్ లాంటి కామెంట్స్‌తో రెచ్చిపోయిన చంద్రబాబు..

TDP - Mahanadu: ‘మహానాడు’కు వేదికగా అధికార వైసీపీపై యుద్ధాన్ని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీని భూస్థాపితం చేస్తాంటూ భీష్మించారు.

TDP - Mahanadu: ‘మహానాడు’ వేదికగా వైసీపీపై యుద్ధం.. బుల్లెట్ లాంటి కామెంట్స్‌తో రెచ్చిపోయిన చంద్రబాబు..
Cbn
Follow us

|

Updated on: May 28, 2022 | 9:19 PM

TDP – Mahanadu: ‘మహానాడు’కు వేదికగా అధికార వైసీపీపై యుద్ధాన్ని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీని భూస్థాపితం చేస్తాంటూ భీష్మించారు. అంతేకాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న డబ్బునంతా కక్కిస్తానంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. ఒంగోలులో టీడీపీ ‘మహానాడు’ సభను భారీగా నిర్వహించారు. లక్షలాది మంది కార్యకర్తలు తరలిరాగా.. తన ప్రసంగంతో వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపారు చంద్రబాబు. ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అంటూ నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదంతోనే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు.

మహానాడు వేదికపై మునుపెన్నడూ లేని రీతిలో ప్రసంగించారు చంద్రబాబు. అధికార వైసీపీ టార్గెట్‌గా బుల్లెట్ లాంటి వ్యాఖ్యలు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి ప్రజలు సిద్ధం అయ్యారని పేర్కొన్న చంద్రబాబు.. త్వరలోనే జగన్‌ను ఇంటికి పంపేందుకు జనాలు ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఉన్మాది జగన్ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలందరిపైనా ఉందంటూ ఘాటైన పదజాలంతో ప్రసంగించారు.

మహానాడుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ వాహనాల టైర్లలో గాలి తీశారని అన్నారు. అయినప్పటికీ.. భారీ స్థాయిలో జనాలు ‘మహానాడు’కు వచ్చారన్నారు. ఈ సభను చూసి జగన్‌కు పిచ్చెక్కిపోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. హద్దులు మీరిన పోలీసుల గాలి మేం తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.

ఇవి కూడా చదవండి

జనంలోకి ఎన్టీఆర్ ఆశయాలు.. ఎన్టీఆర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లాల్లో మినీ మహానాడు కార్యక్రమాలు చేపడతామని పసుపు దళపతి చంద్రబాబు ప్రకటించారు. ఈ మహానాడు వేదికగా వైసీపీ అవినీతిని ఎక్కడికక్కడ ఎండగడతామని అన్నారు. జగన్ ఒక ఉన్నాది అని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. వైసీపీ పాలనలో ఏపీ మరో శ్రీలంకం అవడం ఖాయం అని వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి కూడా లేదన్నారు. భయపెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండంటూ వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు చంద్రబాబు. తాను ఎవరికీ భయపడనని, బుల్లెట్‌లా దూసుకెళ్తానని వ్యాఖ్యానించారు. ‘బాదుడే బాదుడు’ కు పోటీగా ప్రభుత్వం ‘గడపగడప’కు అని చేపట్టిందని, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో ఇప్పుడు బస్సు యాత్ర చేపట్టారని విమర్శించారు.

వైసీపీ పాలనలో 8 లక్షల కోట్ల అప్పు.. వైసీపీ పాలనలో రూ. 8 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చంద్రబాబు విమర్శించారు. ఆ అప్పు అంతా జగన్ కడతాడా? అని నిలదీశారు బాబు. తెచ్చిన అప్పులన్నీ జగన్ జేబులోకి వెళ్లాయని, వాటన్నింటినీ కక్కిస్తానని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఖబడ్దార్ వదిలే ప్రసక్తే లేదంటూ జగన్‌పై ఫైర్ అయ్యారు చంద్రబాబు. అవినీతి సొమ్మునంతా కక్కిస్తానని అన్నారు.

రైతులకు అండగా ఉంటాం.. వైసీపీ పాలనలో రాష్ట్ర రైతాంగం అస్తవ్యస్తం అయ్యారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నాశానం చేశారని ఆరోపించిన ఆయన.. ఏపీలో ఏ రైతు కూడా ఆనందంగా లేడని వ్యాఖ్యానించారు. జగన్ సర్కార్ రైతులకు ఇచ్చింది గోరంత.. చెప్పుకునేది కొండంత అని విమర్శించారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని, రైతులకు తాము అండగా ఉంటామని అన్నారు.

ఉద్యోగాలు లేవు.. జగన్ పాలనలో ఉద్యోగాల ఊసే లేదని విమర్శించారు చంద్రబాబు. తాను ఐటీ ఉద్యోగాలిస్తే.. జగన్ వాలంటీర్ ఉద్యోగాలిచ్చారని అన్నారు. ఉద్యోగ సంఘాలకు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. పీఆర్సీ సరిగా ఇచ్చాడా? సీపీఎస్ రద్దు చేశాడా? అని ప్రశ్నించారు. 30 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. మూడే ఇళ్లు కట్టించాడని విమర్శించారు. కరోనా కంటే జగన్ విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నష్టపోయిందన్నారు.

అమరావతిని నిర్వీర్యం చేశారు.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే.. దానిని నిర్వీర్యం చేశారని వైసీపీ పాలనా విధానాలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పోవడం వలన రూ.3 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిందన్నారు. రాజధానిగా అమరావతికి జగన్ గతంలో మద్దతు తెలిపారని, అధికారం వచ్చాక రివర్స్ అయ్యారని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం అన్నీ సమస్యలే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా మారిందని, పరిశ్రమలు పోయాయి.. కొత్తవి వస్తాయనే నమ్మకం లేదు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చెప్పిన ప్రత్యేక హోదా ఏమైంది? అని ప్రశ్నించారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాలను జగన్‌రెడ్డి కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు ఆరోపించారు. సీఎం జగన్ ఆదాయం పెరుగుతంది.. ప్రజల ఆదాయం తగ్గుతోందని విమర్శించారు.

అఖండను అడ్డుకుంటారా? భారతి సిమెంట్స్‌ పర్మీషన్ ఇచ్చేది నేనే.. అఖండ సినిమాను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. అయినప్పటికీ.. ప్రజలపై నమ్మకం ఉంచి బాలకృష్ణ తన సినిమాను విడుదల చేశారని, అది సూపర్ సక్సెస్ అయిందని అన్నారు. సినిమా వాళ్లను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ‘సినిమా విడుదల చేయాలంటే ప్రభుత్వ పర్మిషన్ కావాలా? రేపు జగన్ కంపనీ భారతీ సిమెంట్‌కు పర్మిషన్ ఇచ్చేది నేనే.’ అని వ్యాఖ్యానించారు చంద్రబాబు. ఛార్జీలన్నీ పెరిగాయని, వీర బాదుడు బాదుతున్నారని అన్నారు.

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.